18 ఏళ్లు పైబడిన వారికి టీకా కష్టమే..?
మొదటి విడతలో కరోనా వారియర్స్ రెండవ విడతలో 60 సంవత్సరాలు పైబడిన వయస్సు వారికి ఇక మూడో విడతలో 45 సంవత్సరాల వయస్సు పై బడిన వారికి వ్యాక్సిన్ అందించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అటు రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక విపత్కర పరిస్థితులు రాకముందే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అయితే కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చినప్పటికీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి టీకా అందించలేము చెబుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి వ్యాక్సిన్ అందించలేమని జూన్ 1 నుంచి అందించే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చింది ఆ రాష్ట్ర వైద్య శాఖ.కాగా ఇటీవల తెలంగాణ వైద్య శాఖ కూడా ఇలాంటి ప్రకటన చేసింది.18 ఏళ్ల పైబడిన వారికి మే ఒకటి నుంచి టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో అందుకు మరింత సమయం పడుతుందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు తమ సమాచారాన్ని పొందుపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అయితే సత్వరంగా 45 సంవత్సరాలు నిండిన వారికి టీకా పూర్తిచేసే ప్రక్రియను శరవేగంగా నిర్వహిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు