కని కరోనా : కరోనా వస్తే ఈ మాత్రలు అస్సలు వేసుకోకండి.. తస్మాత్ జాగ్రత్త..?
కానీ ఇప్పటికి కూడా కొంతమంది కరోనా వైరస్ బారిన పడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఎన్నో అనుమానాలు అపోహలు తోనే ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన తర్వాత ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి మందులు వాడకూడదు అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఇక ఇష్టం వచ్చిన మాత్రలను వాడుతూ చివరికి అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే వైరస్ వచ్చిన సమయంలో కొన్ని రకాల మాత్రలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది అని సూచిస్తున్నారు వైద్యులు. అయితే వైరస్ సోకిన సమయంలో తీసుకోకూడని మందుల విషయంలో ఇటీవలే ఐసీఎంఆర్ కీలక విషయాలను వెల్లడించింది.
కరోనా వైరస్ బారిన పడిన తర్వాత ఐబు ప్రొఫైన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడటం ఎంతో హానికరం అంటూ ఐసీఎంఆర్ ఇటీవలే వెల్లడించింది. ఇక ఇలాంటి మాత్రలు వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అంతేకాకుండా కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కూడా పొంచి ఉంది అంటూ ఐసీఎంఆర్ హెచ్చరించింది. కరోనా వైరస్ బారిన పడిన సమయంలో స్టెరాయిడ్స్ యాంటీ ఇంప్లమెటరీ వంటి డ్రగ్స్ కి దూరంగా ఉండడం ఎంతో మంచిది అంటూ సూచించింది. అవసరం అయితే పారాసెటమాల్ మాత్రలు తీసుకోవడం ఉత్తమం అంటూ ఐసీఎంఆర్ సూచించింది.