కరోనా సంక్షోభంలో భారత్‌కు యాపిల్ సీఈఓ చేయూత..!

Suma Kallamadi
కరోనా మహమ్మారి కారణంగా భారత దేశ ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు ఇతర దేశస్తులను కలిచి వేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి సపోర్ట్ గా నిలిచేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భారత్ కరోనా ని ఎదుర్కొనే విషయంలో తమ సంస్థ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమెరికా యంత్రాంగం కూడా కరోనా వైరస్ తో సతమతమౌతున్న భారత్ కి అవసరమైన మౌలిక వసతులను సరఫరా చేస్తామని ముందుకు వచ్చింది. ఆక్సిజన్‌ పరికరాలు, ర్యాపిడ్‌ టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు వంటివి తక్షణమే ఇండియాకి పంపించే ఏర్పాటు చేస్తున్నామని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. కష్టకాలంలో ఇండియా కి అండగా ఉంటానని అమెరికా ప్రకటించడం నిజంగా ప్రశంసనీయం.


ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా భారత ప్రజల దుస్థితిని చూసి చలించిపోయారు. "భారత్ లో విధ్వంసకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి, మా యాపిల్ కుటుంబానికి, ఇంకా కరోనా తో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ మేము అండగా ఉంటాము. భారత్‌కు సహాయార్థం యాపిల్ సంస్థ విరాళాలు అందిస్తుంది. సహాయక చర్యలలో యాపిల్ సంస్థ తమ వంతు సపోర్ట్ చేస్తుంది," అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.



కరోనా విపత్తు నుంచి భారత దేశాన్ని కాపాడేందుకు టాప్ 40 అమెరికన్ కంపెనీల సీఈఓ లు ఏకతాటి మీదకు వచ్చి మౌలిక సదుపాయాలను అందించేందుకు కంకణం కట్టుకున్నారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా భారతదేశంలో 3 లక్షలకు పైగా రోజువారి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. స్మశాన వాటిక లలో మృతదేహాలు దహనం చేయడానికి ఖాళీ లేని పరిస్థితిని ప్రస్తుతం ఇండియా చవి చూస్తోంది. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు సక్రమంగా నిర్వహించే పరిస్థితులు కూడా భారత దేశంలో నెలకొన లేదు. ఆక్సిజన్ కొరతతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత సైతం ప్రాణాలను కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు కడుపు కోతతో కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ పరిస్థితులలో ప్రభుత్వాలు సైతం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన తమ వంతు కృషి చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: