
కని కరోనా: ఏపిలో డేంజర్ బెల్స్.. ఆ నాలుగు జిల్లాల్లో..
తాజాగా రాష్ట్రంలో45 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఉధృతికి కారణం ఏంటి? ఎందుకు ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మొదటి వేవ్ దశలో కూడా ఎపి లో కేసులు భారీ స్థాయిలో నమోదయ్యాయి. రెండో దశలో కూడా అదే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పైగా మరణాల రేటు కూడా క్రమంగా పెరుగుతుంది.. ఎక్కడ పొరపాటు జరుగుతుంది. మనుషుల ప్రాణాలతో ప్రభుత్వానికి పని లేదా? అనే సందేహాలు జనాల్లో కలగడం సహజం..
ఇది ఇలా ఉండగా..ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో 74,041 కరోనా పరీక్షలు నిర్వహించగా 9,881 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,592 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు, గుంటూరు జిల్లాలో 1,048 కేసులు, విశాఖ జిల్లాలో 1,030 కేసులు గుర్తించారు.ఇకపోతే 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా, 51 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 10,43,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా. 9,40,574 మంది కరోనా నుంచి కరోనా నుంచి కోలుకున్నారు.. ఇంకా 95,131 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 7,736కి పెరిగింది...కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటుంది అన్నది మాత్రం ఉత్కంఠగా మారుతుంది.