హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

Purushottham Vinay

ఈ కరోనా మహమ్మారీ ఏమంటూ చైనా నుంచి పుట్టుకోచ్చిందో ప్రపంచం మొత్తాన్ని నట్టేట ముంచుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు గాడిన పడగా భారతదేశం మాత్రం అతలాకుతలం అవుతుంది.రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు. అలాగే మరణాలను అదుపు చెయ్యలేక డాక్టర్లు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తుంది. రోజుకి ఎన్నో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. జనాలు ఏం చెయ్యాలో తెలీక తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే అదుపు చెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఇక ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో కరోనా మరణాలు ఎక్కువయ్యి డాక్టర్లు అదుపు తప్పి ఏడుస్తున్నారు .ఒక పక్క ప్రభుత్వాధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురు అవుతున్నాయి.కరోనా ఒక విష పాములా తయారయ్యి తన కొరలతో కుటుంబాలను కాటు వేస్తుంది.


కుటుంబాల్లో నింపుతున్న విషాదం అంతా ఇంతా కాదు.

ఇక మరీ ముఖ్యంగా వలస కూలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కూలీలు ఈ కరోనా వల్ల పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఇక సికింద్రాబాద్  సమీపంలో ఇటుక రాయి పనిచేస్తున్న సంబల్పూర్ నుండి వచ్చిన కార్మికుల బృందం హైదరాబాద్ బస్ స్టాండ్ వద్ద చిక్కుకుని ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తోంది. వారిని ఆ బ్రిక్లిన్ యజమాని బయటకు తరిమెయ్యడంతో వారు తీవ్ర అవస్థలుపడుతున్నారు. వారి వద్ద డబ్బు లేదు. గత 3 రోజులుగా వారు సరిగ్గా తిండి కూడా తినలేదు. వారిని వెంటనే తమ స్వస్థలానికి పంపాలని సమీత్ పండా అనే వ్యక్తి ట్విట్టర్ లో వారి ఫొటో ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ చూసి కేటీఆర్ స్పందించారు. వారిని తమ సొంత ఊళ్లకు పంపించే బాధ్యత తీసుకుంటానని ట్వీట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: