కని కరోనా : గుడ్ న్యూస్.. కరోనా టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదు.. నేరుగా..?

praveen
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది దీంతో రాష్ట్ర ప్రజానీకం మొత్తం మళ్లీ ఆందోళనలో మునిగిపోతుంది.  అదే సమయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన ఆంక్షలను  కూడా అమలులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.  అయితే ఇక కరోనా వైరస్ రోగుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుండటం ఎంతోమంది ఇక ఆరోగ్యం విషమించి ఆసుపత్రులకు వెళ్తున్న నేపథ్యంలో ఇక ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పూర్తిగా గాంధీ ఆస్పత్రి ని కరోనా ఆస్పత్రి గా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. కూడా గాంధీ ఆస్పత్రిలో నాన్ కరోనా వార్డులను  తొలగించి కరోనా వార్డులుగా మార్చింది.



 ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక కరోనా వైరస్ రోగులు అందరిని కూడా గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో జయమ్మ అనే 50 ఏళ్ల మహిళ కరోనా వైరస్ బారినపడి తీవ్రంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కరోనా రిపోర్టు లేకపోవడంతో ఇక ఆమెను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది ఆ మొగ్గు చూపలేదు. కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇక ఊపిరాడక ఎంతో విలవిలలాడి పోయి అంబులెన్స్ లోనే ఆమె మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ఇటీవలే గాంధీ ఆసుపత్రి సిబ్బంది కి ఇక ఆసుపత్రి సూపర్-ఇండెంట్ రాజారావు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా రిపోర్టు లేకపోయినప్పటికీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్చుకోవాలి అంటూ తెలిపారు. ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు లేకపోయినప్పటికీ ఎలాంటి ఆలస్యం చేయకుండా రోగులను చేరుకుని చికిత్స అందించేందుకు ప్రస్తుతం డాక్టర్లు సిద్ధం కావాలని సూచించారు. అయితే గాంధీని పూర్తిస్థాయి కరోనా వైరస్ ఆస్పత్రిగా ప్రకటించిన తర్వాత కరోనా వైరస్ రిపోర్టు ఉంటేనే రోగులను అడ్మిట్ చేసుకునేందుకు అనుమతి ఉండేది కానీ ఇటీవల జయమ్మ అనే మహిళ ఇక ఇలాంటి రిపోర్ట్ లేకపోవడం కారణంగా అంబులెన్స్ లోనే మరణించడంతో ఇక ఈ నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: