శవ రాజకీయాలు సీఎం.. అందుకోసమేనా..?

praveen
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  వైరస్ కేసులు ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలలో మాత్రమే  అంతకుమించి అనే రేంజ్ లో   వైరస్ కేసులు ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయి.  దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే కరోనా వైరస్ హాట్ స్పాట్ గా మారిపోయింది మహారాష్ట్ర. కేవలం ప్రస్తుతం మాత్రమే కాదు గత ఏడాది కరోనా వైరస్ విషయంలో కూడా ఇక అతి ఎక్కువ కేసులు కలిగిన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది.

 అంతేకాదు దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే ఎక్కువగా కరోనా వైరస్ మరణాలు  కూడా మహారాష్ట్ర ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.  ఇది ప్రభుత్వం వైఫల్యం అయినప్పటికీ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 మహారాష్ట్రలో కరోనా వ్యాక్సిన్ కొరత రేమిడిసివర్ నిల్వలు లేకపోవడంతో వీటిని అందించి మహారాష్ట్రను ఆదుకోవాలి అంటూ కోరడానికి ప్రధాని నరేంద్ర కి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఆయన బెంగాల్ అసెంబ్లీ ప్రచారంలో ఎంతో బిజీగా ఉండడంతో ఆయన ఫోన్ కి రెస్పాండ్ కాలేదని.. ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. ప్రజలు ఓ వైపు ప్రాణాలు కోల్పోతూ ఉంటే మోదీ కేవలం ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నించారు. మోడీ తో మాట్లాడడానికి ఎంత  ప్రయత్నించినప్పటికీ అయన సిబ్బంది మాత్రం  మాట్లాడడానికి సహకరించలేదు అంటూ తెలిపారు. మహారాష్ట్రలో రేమిడిసివర్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అయితే వీటిని పంపిణీ చేసే కంపెనీలతో సంప్రదింపులు జరిపి మోదీ సర్కార్ మహారాష్ట్రకు  లాంటివి ఇవ్వొద్దు అని చెప్పింది అంటూ మహారాష్ట్ర సర్కార్ చెప్పడం మరింత విడ్డూరంగా మారిపోయింది. ఉద్ధవ్ థాక్రే శవ రాజకీయాలు మొదలు పెట్టారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: