కోవిడ్‌కు లైంగీక హింస‌కు ఉన్న లింక్ ఇదే ?

VUYYURU SUBHASH
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త యేడాది కాలంగా ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఈ వైర‌స్ ప్రపంచ ఉరుకుల ప‌రుగుల‌కు ఒక్క‌సారిగా స‌డెన్ బ్రేక్ వేసేసింది. ఇక ప్ర‌పంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఒక్క‌సారిగా కుదేల‌య్యాయి. జ‌న జీవ‌నం ఎక్క‌డిక‌క్క‌డ స్తంభించి పోయింది. అస‌లు ప్ర‌జ‌లు ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకే భ‌య‌ప‌డ్డారు. ఇలాంటి  మహమ్మారి కారణంగా గత ఏడాది లైంగిక హింస పెరిగిందని నివేదిక‌లు అంద‌రికి షాక్ ఇస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) తాజాగా వెల్ల‌డించిన నివేదిక‌ల్లో క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలోని పలు దేశాల్లో సైన్యాలు, సాయుధ మూకలు.. లైంగిక హింసను ఒక యుద్ధవ్యూహంగా, రాజకీయ అణచివేతకు ఉపయోగించుకున్నాయని తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక‌ల్లో క‌ళ్లు బైర్లు గ‌మ్మే విష‌యాలు కూడా ఉన్నాయి. మొత్తం 18 దేశాల్లో 52 సైన్యాలు లేదా సాయుధ మూకలు మహిళలపై అకృత్యాలకు పాల్పడినట్లు తమ వద్ద ప‌క్కా సమాచారం ఉంద‌ని కూడా ఐక్య‌రాజ్య స‌మితి చెప్పింది.

ముఖ్యంగా క‌రోనా పేరు చెప్పుకుని.. అణిచి వేస్తోన్న క్ర‌మంలో ప్ర‌భుత్వ మూక‌ల కంటే.. ప్ర‌భుత్వంతో సంబంధం లేని అల్ల‌రి మూక‌లే ఎక్కువుగా ఈ లైంగీక దాడుల‌కు పాల్ప‌డుతున్నాయ‌ట‌. ఈ లైంగీక దాడుల్లో ప్రతిపక్షాలు, తిరుగుబాటు బృందాలు, అల్‌ఖైదా లేదా ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధమున్న సంస్థ‌లే ఎక్కువుగా ఉంటున్నాయ‌ని కూడా నివేదిక స్ప‌ష్టం చేసింది.

కొన్ని ప్ర‌భుత్వే త‌ర సంస్థ‌లు అయితే మ‌హిళ‌ల నిస్స‌హాయ‌త‌, వారి అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని వారిపై లైంగీక దాడుల‌కు పాల్ప‌డుతున్నాయ‌ట‌. అయితే ఇదంతా పేద‌, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి దేశాల్లోనే ఎక్కువుగా జ‌రుగుతోంద‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: