వైసీపీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్...?

VAMSI
ఏదైనా ఒక అంశాన్ని అది చెడు కానీ లేదా మంచి కానీ ప్రతి ఒక్కరికీ తొందరగా సమాచారం తెలియడానికి ఉపయోగించేది సామజిక మాధ్యమం. ప్రస్తుత కాలంలో దీనిని ఉపయోగించని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇదే సోషల్ మీడియాను రాజకీయంగా ఉపయోగించడంలో అన్ని పార్టీలు ముందుంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తమ తమ అజెండాను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి సోషల్  మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా పాత్ర ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలలో సమర్ధవంతంగా ఈ సోషల్ మీడియాను వాడుకుంటోంది టీడీపీ మాత్రమే. ఎందుకంటే వీరికి ఉన్న సోషల్ మీడియా గ్రూప్ లు అధికారికంగా మరియు అనధికారికంగా ఇతర పార్టీల కంటే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. పార్టీకి సంబంధించి ఏదైనా లైవ్ జరిగినా వెంటనే అది ఫేస్బుక్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాలలో ప్రసారం కావడం మనము చూస్తూనే ఉన్నాము. 

కానీ మనము అధికార పార్టీ వైసీపీ విషయం తీసుకుంటే...వీరికి ఒకవైపు అధికారిక డిజిటల్ వింగ్స్ ఉంటాయి...మరియు స్వచ్ఛందంగా కూడా పనిచేసే వారు ఎంతో మంది ఉన్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా ఇంతమంది ఇన్ని గ్రూపులు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం జరిగినప్పుడు లైవ్ రాదు. పైగా ఈ సోషల్ మీడియా నిర్వహణకు గానూ కోట్లకు కోట్లు డబ్బులు ఖర్చుపెడతారు. ఆ తరువాత ఎప్పుడో నాలుగు లేదా అయిదు గంటల తరువాత లైవ్ వస్తుంది. అలా కాకుండా ఎవరైనా వ్యక్తిగతంగా లైవ్ ప్రోగ్రాం వస్తే..అలాంటివి మాత్రం వెంటనే లైవ్ వస్తుంటాయి. ఇవన్నీ వైసీపీ అధిష్టానానికి తెలిసి జరుగుతాయా ..? లేదా అన్నది వారు తెలుసుకోవలసిన అవసరం ఉంది. తాజాగా జరిగిన ఒక సంఘటన వలన వైసీపీ సోషల్ మీడియా పరంగా ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతుంది. నిన్న వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేసింది. టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత మరియు ఇతర టీడీపీ నాయకులు తిరుమల దర్శనం చేసుకుని తిరుపతి ప్రచారంలో పాల్గొన్నారు.

అందుకే వారికంతా కరోనా వచ్చిందని హైలైట్ చేశారు.  అయితే ఈ విషయంపై అనిత చాలా ఘాటైన సమాధానాన్ని ఇచ్చారు. నాకు నా అనుచరులకు కరోనా వచ్చిందని నీలి మీడియా అయిదు రూపాయల చెంచాలు ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రమాణం చేయమని సవాలు విసిరితే ప్రచారానికి రాకుండా దాక్కున్న పారాసెటమాల్ చవటలం కాదు మేము. అన్ని జాగ్రత్తలను తీసుకున్న తరువాతే మేము ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాము అంటూ అనిత తెలిపారు. ఈ విషయం వెంటనే సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. వీరు చెప్పిన విషయం వైసీపీ వారికన్నా వైరల్ అయింది.

కానీ వైసీపీ వారు చేసిన అభియోగం ఎక్కడా కూడా కనబడలేదు. ఇలాంటి సందర్భంలో ప్రజలు కూడా ఏ విషయాన్ని నమ్ముతారో మీరే ఆలోచించండి. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, అంతే కానీ ఏదో ఒక విషయాన్ని నిజాన్ని చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా దానికి సంబంధించి ఆధారాలు ఉంటే వారు అవి పోస్ట్ చేయొచ్చు. ఎవరి మీద అయినా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేటప్పుడు అది నిజమైనదిగా ఉండాలి. ఫేక్ విషయాలను పెట్టకూడదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: