కొత్త ఇసుక పాలసి వాయిదా.. ఎప్పుడు ప్రారంభమో తెలుసా..?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పథకాల అమలు విషయంలో కూడా ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసుకునే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఇసుక పంపిణీ విషయంలో కూడా సరికొత్త ఇసుక పాలసీ ని తెర మీదకి తీసుకు రావడం అటు రాష్ట్ర రాజకీయాల్లో
 సంచలనం గానే మారిపోయింది.


 జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ ద్వారా సామాన్య ప్రజలకు ఇసుక అందకుండా మారిపోయిందని పూర్తిగా రాష్ట్రంలో ఇసుక అక్రమార్కుల పాలవుతుందని తద్వారా భారీగా ఇసుక కొరత ఏర్పడుతుంది అని అటు ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి. రాష్ట్ర ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ పారదర్శకంగా ముందుకు సాగుతుంది అని చెబుతున్నప్పటికీ ఇక కొన్ని లోపాలు ఉండటం తో వరుసగా ఇసుక పాలసీలను మార్చుకుంటూ కొత్త పాలసీలను తెరమీదికి తెచ్చింది. ఇలా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇకపోతే ఏప్రిల్ నెలలో సరి కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించినట్లు గతంలో ఆంధ్ర రాజకీయాల్లో చర్చ నడిచింది ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఇసుక సరఫరా టెండర్లు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది.  ఈ నెల 11 తేదీ నుండి కొత్త ఇసుక పాలసి ప్రారంభం అవుతుందని  తెలిపింది. ఒక ప్రవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించాలి అని బావించింది ప్రభుత్వం. కానీ గనుల శాఖలోని కీలక అధికారి కరోనా భారిన పడిన నేపథ్యంలో ఈ నెల 11 న ప్రారంభం కావాల్సిన ఇసుక పాలసీ ఏప్రిల్ 16 నుండి  తెరమీదకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: