అధిష్టానం వద్దన్నా.. ఆగని టీడీపీ నేతలు..
కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వం చేతిలో రబ్బర్ స్టాంప్‌గా మారిపోయారని, అనేక అక్రమాలకు ఎదురీదుతూ పోరాటం చేయలేమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న విషయం తెలిసిందే.ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసి, అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయిన దశలో పోటీ నుంచి విరమణ సరికాదని, పోటీలో కొనసాగాలని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిర్ణయించారు. మండలాలవారీగా సమావేశాలు నిర్వహించుకొని పోటీలో కొనసాగుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. ప్రచారంలోకి కూడా వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల ఈ పరిణామం చోటుచేసుకొంటోంది.
అలాగే విశాఖ పట్టణం లో కూడా ఇదే తంతు కొనసాగుతుంది. కడప, చిత్తూరు, అనంతపురం లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు కనిపించకుండా స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొని, అమలు చేస్తున్నామని, క్యాడర్‌ను కాపాడుకొని వారికి కూడా కొన్ని పదవులు దక్కడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ స్థానిక నేతలు పోటీలో కొనసాగడానికే మొగ్గు చూపుతున్నారు. 'పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేసి పోరాడాం. క్యాడర్ నిలబడ్డారు. ఇప్పుడు వదిలేస్తే వాళ్లు నీరుగారిపోతారు. పశ్చిమ గోదావరిలో టీడీపీకి సపోర్ట్ ఉండటంతో ఎక్కువ ఫోకస్ అక్కడే పెట్టినట్లు తెలుస్తోంది.. వారి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి..