వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

VUYYURU SUBHASH
విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో యువ నాయ‌కుడుగా దేవినేని అవినాష్ మెరిసిపోతున్నారు.- ఇదేదో.. ఎవ‌రో ఆయ‌న‌కు డ‌ప్పుకొట్టే వాళ్లు అన్న‌మాట కాదు. ఏకంగా పార్టీలో స‌ల‌హా దారుగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు అన్యాప‌దేశంగానే పేర్కొన్న మాట‌. నిజ‌మే.. గ‌తానికి ఇప్ప‌టికి దేవినేని అవినాష్‌లో చాలా మార్పు క‌నిపిస్తోంది. ఆయ‌న ఇప్పుడు చాలా స్వేచ్ఛ‌గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న త‌న‌దైన శైలిని తెర‌మీద‌కి తెస్తున్నారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ద్య ఉంటున్నారు. పార్టీ కార్య‌క్రమాలు, నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల బాగోగులు కూడా చూస్తున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి ?  ఎందుకు ఇలా చేస్తున్నారు ? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

దీనికి ప్ర‌ధానంగా సీఎం జ‌గ‌న్ నుంచి అవినాష్‌కు మంచి ప్రోత్సాహం ల‌భిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది యువ‌త ఉన్న‌ప్ప టికీ.. సీఎం జ‌గ‌న్ కృష్ణాజిల్లాలో ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. స్వ‌యంగా ఆయ‌న నుంచి కానీ.. లేదా కీల‌క స‌ల‌హా దారు నుంచి కానీ.. అవినాష్‌కు ప్ర‌త్యేక ఆహ్వానం అందుతోంది. దీంతో ఆయా కార్య‌క్ర‌మాల్లో అవినాష్ మెరుస్తున్నారు. సీఎం జ‌గ‌న్ కూడా త‌న వెంటే అవినాష్‌ను తిప్పుకొంటున్నారు. విజ‌యవాడ‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ప్రభావితం చేయ‌గ‌ల నాయ‌కుడు వైసీపీకి పెద్ద‌గా ఎవ‌రూ లేదు. కొంద‌రు సీనియ‌ర్లు ఉన్నా.. వారి కంటే యువ నాయ‌కుడిగా అవినాష్ దూకుడు చాలా భిన్నంగా ఉంది.

అదేవిధంగా.. యువ‌త‌లోనూ అవినాష్‌కు మంచి క్రేజ్ ఉంది. పైగా తండ్రి వార‌స‌త్వం తాలూకు ల‌క్ష‌ణాలు పుణికి పుచ్చుకుని రావ‌డం కూడా అవినాష్‌రాజ‌కీయాల‌కు ప్ల‌స్‌గా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీకి చెక్ పెట్టాలంటే.. ముఖ్యంగా బ‌లైమ‌న సామాజిక వ‌ర్గంగా ఉన్న క‌మ్మ‌ల‌ను వైసీపీ వైపు తిప్పుకోవాలంటే.. అవినాష్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. జిల్లాలో అయితే.. కొడాలి నాని, విజ‌య‌వాడ‌లో అయితే.. అవినాష్ స‌రైన నాయ‌కులుగా జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్టు కొన్నాళ్లుగా ప్ర‌చారంలో ఉంది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ‌లో అవినాష్‌కు ప్రాధాన్యం పెంచుతున్నార‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: