ముఖంపై నల్లటి మచ్చలా.. పోవాలంటే ఇలా చేయండి..?
అయితే మరి కొంత మంది ఇక ముఖం పై ఉన్న మచ్చలను కవర్ చేసుకోవడానికి ఎక్కువగా మేకప్ వేసుకోవడం లాంటివి చేస్తున్నారు.. అయితే మేకప్ వేసుకుంటే మొటిమలు కనిపించకుండా పోతాయి కానీ సహజసిద్ధమైన సౌందర్య మాత్రం తగ్గడం లేదు అని భావించి సహజసిద్ధమైన సౌందర్యం కోసం ఎంతోమంది ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ముఖం పై ఉన్న మచ్చలను పోగొట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే కొన్ని రకాల వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు ఇక ముఖం పై ఉన్న నల్లటి మచ్చలు తొలగించుకోవచ్చు అని అటు ఎంతో మంది నిపుణులు సూచిస్తూ ఉంటారు.
కలబంద గుజ్జును ముఖం పై మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం సమయంలో కడుక్కోవడం వల్ల కొన్ని రోజుల్లోనే రిజల్ట్ వుంటుంది అని చెబుతున్నారు నిపుణులు. మచ్చలు ఉన్న దగ్గర రెండు నిమిషాలు నిమ్మరసం రుద్ది ఇక ఆ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందట. నీళ్లు ఆపిల్ సైడర్ వెనిగర్ సమపాళ్లలో తీసుకొని మచ్చలు ఉన్న చోట రాస్తే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు పాలల్లో పసుపు కలిపి ముఖంపై నల్లటి మచ్చలు ఉన్న చోట రాస్తే నల్లటి మచ్చలు మాయమవుతాయట.