నారా లోకేష్ మాటలు ప్రజాస్వామ్యం కంటే ప్రతీకారానికి దారి తీసేలా వున్నాయి...

Purushottham Vinay
నందమూరి నట సింహం బాల కృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ గా దూసుకుపోతున్నారు. వీళ్ళకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో లక్షల అభిమానులను వీరు సంపాదించుకున్నారు. ఇక వీరు చెప్పే డైలాగ్స్ కి కూడా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఇక వీళ్ళకి సహజంగా కోపం కూడా ఎక్కువే. ఇక రాజకీయాల్లో అనేక ప్రసంగాలు చేస్తున్నప్పుడు కాని సినిమా ఫంక్షన్ లలో మాట్లాడుతునప్పుడు కాని వీళ్ళు కోప్పడుతూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ తాట తీస్తా తోలు తీస్తా అని చాలా సందర్భాలలో తిట్టాడు కూడా. ఇక బాల కృష్ణ కూడా పలు సందర్భాలలో ఇలా తిట్టడం చూసే ఉంటాము.



ఇక వీళ్ళ లాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రెచ్చిపోయి మాట్లాడటం మొదలు పెట్టాడు.ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో కొందరిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కొందరిని ఆయన ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు కూడా చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక తమ పార్టీ తరపున గెలిచిన ఒక దళిత సర్పంచ్ వేధింపులకు గురయ్యి చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్లిన లోకేష్ మా వాళ్లపై ఇలాంటి వేధింపులు చేస్తే తాట తీస్తాం అని వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక గత రెండేళ్లనుంచి మీ ప్రభుత్వం వచ్చాక మా అభ్యర్థులు పాతికమంది మీ వేధింపులకు గురయ్యి చనిపోయారని ఇక మేము అధికారంలోకి వస్తే ఇంతకు రెట్టింపు చేస్తాం అనే లోకేష్ మాటలు ఇక్కడ ప్రజా స్వామ్యం కంటే కూడా ప్రతీకారానికి దారి తీసేలా వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: