వంశీకి రూట్ క్లియర్ చేసిన బాబు..కొడాలి ఫార్ములా..

M N Amaleswara rao
కృష్ణా జిల్లాలో టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఈ నియోజకవర్గంలో ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది. అయితే ఈ సారి నుంచి ఆ పరిస్తితి ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ...వైసీపీ వైపు వెళ్ళిపోయారు. టీడీపీని వీడి జగన్‌కు జై కొట్టారు. ఎప్పుడైతే వంశీ టీడీపీని వీడారో అప్పటినుంచి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ సత్తా తగ్గిపోయింది. టీడీపీ తరుపున మరో నాయకుడుని పెట్టినా కూడా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు.

అయితే గతంలో గుడివాడలో కూడా ఇలాగే జరిగింది. గుడివాడ టీడీపీకి కంచుకోట. కొడాలి నాని ఇలాగే రెండుసార్లు గుడివాడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీలోకి జంప్ కొట్టి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయ్యారు. ఇలా కొడాలి వైసీపీ వైపుకు వెళ్లడంతో, గుడివాడలో టీడీపీని నడిపించే నాయకుడు కనిపించడం లేదు. ఇప్పటికే చంద్రబాబు ఓ సారి రావి వెంకటేశ్వరరావుని, మరొకసారి దేవినేని అవినాష్‌ని కొడాలిపై నిలబెట్టారు.

అయినా సరే పార్టీ గెలవలేదు. ఓడిపోయిన అవినాష్ వైసీపీలోకి వెళ్లడంతో మళ్ళీ రావిని పెట్టి బండి లాగిస్తున్నారు. అయితే కొడాలి దెబ్బకు భవిష్యత్‌లో గుడివాడలో టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఇదే పరిస్తితి గన్నవరంలో కనిపిస్తోంది. వంశీ టీడీపీని వీడాక చంద్రబాబు, బచ్చుల అర్జునుడుని గన్నవరం ఇన్‌చార్జ్‌గా పెట్టారు.

ఇక అర్జునుడు టీడీపీని బ్రతికించే పనిలో ఉన్నారు. కాకపోతే వంశీ బలం ముందు అర్జునుడు తేలిపోతున్నారు. మొన్న పంచాయితీ ఎన్నికల్లో సైతం వంశీ హవా నడిచింది. ఇక దీని బట్టి చూస్తే అర్జునుడు బరిలో ఉన్నా సరే వంశీకి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. మొత్తానికైతే బాబు...వంశీకి రూట్ క్లియర్ చేసినట్లే కనిపిస్తోంది. భవిష్యత్‌లో గన్నవరంలో టీడీపీ జెండా ఎగరడం కష్టమనే చెప్పొచ్చు. ఇక కొడాలికి లాగానే వంశీకి కూడా తిరుగులేనట్లే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: