వైసీపీ కి ఊహించని షాక్.. ఎన్నికల్లో గెలిచిన వారానికే మహిళా కార్పొరేటర్..?
విశాఖ పట్నం 61 వ వార్డు నుంచి కార్పొరేటర్గా గెలుపొందింది వైసీపీ అభ్యర్థి సూర్య కుమారి. కాగా ఇటీవలే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబం తో కలిసి పారిశ్రామిక వాడలో నివసించే సూర్య కుమారి ఇక ఆకస్మాత్తుగా మృతి చెందడం అటు కుటుంబ సభ్యులను పార్టీ శ్రేణులను కూడా విషాదం లో ముంచెత్తింది. మున్సిపల్ ఎన్నికలలో వైసిపి పార్టీ అభ్యర్థి సూర్య కుమారి విజయం సాధించిందని పార్టీ శ్రేణులు అందరూ ఆనంద పడుతున్న సమయంలో ఆమె మృతి అందరిని షాక్కు గురి చేసింది.
అయితే ఇక సూర్య కుమారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో ఆకస్మాత్తుగా సూర్యకుమారి మృతి చెందడంతో ఇక అటు పోలీసులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమారినీ ఎవరైనా హత్య చేశారా లేదా అనారోగ్యంతో చనిపోయిందా అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇలా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని వైసీపీ కార్యకర్తలు సంతోషం లో ఉండగా అంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.