హైదరాబాదులో ఐపీఎల్ పెట్టండి.. టిఆర్ఎస్ ఎంపీ రిక్వెస్ట్..?

praveen
సాధారణంగా భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఐపీఎల్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి ఉర్రూతలూగి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లోని ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే  అతి పెద్ద దేశవాళీ క్రికెట్ లీగ్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఐపీఎల్ లో ఎంతో మంది భారత ఆటగాళ్లు ప్రత్యర్థులుగా మారిపోయి హోరాహోరీగా పోటీ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో సహచరులుగా మారిపోతుంటారు.

 అందుకే ఐపీఎల్ టోర్నీ కాస్త అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కనీవినీ ఎరుగని రీతిలో వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే దేశంలోని ప్రధాన నగరాలలో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహిస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే ప్రతి ఏడాది హైదరాబాద్ వేదికగా కూడా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తూ ఉంటుంది బిసిసిఐ. కానీ ఈ ఏడాది మాత్రం  వైరస్ వ్యాప్తి దృశ్య..  హైదరాబాద్లో బిసిసీఐ ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు అంతగా ఆసక్తి చూపలేదు అనే విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం కు వెళ్లి  ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించాలి అనుకున్న ప్రేక్షకులకు బిసిసిఐ నిర్ణయం తో ఊహించని షాక్ తగిలింది.

 ఈ క్రమంలోనే హైదరాబాదులో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలి అంటూ గతంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ బిసిసిఐకి విజ్ఞప్తి చేశారు అని విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో టిఆర్ఎస్ మంత్రి కూడా ఇలాంటి రిక్వెస్ట్ చేశారు. ఐపీఎల్ 2021 మ్యాచ్లను హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.  ఐపీఎల్ హైదరాబాద్ లో నిర్వహించకపోవడం క్రికెట్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచినది అంటూ ఇటీవల లోక్ సభ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దేశంలోని ప్రధాన నగరాలు అన్నింటికంటే హైదరాబాద్లోనే తక్కువ కేసులు ఉన్నాయని ఇక్కడ ఐపీఎల్ నిర్వహించడానికి ఎంతో అనువైనది అంటూ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ నిర్వహిస్తే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము అంటూ చెప్పుకొచ్చారు ఎంపీ రంజిత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: