అంగారక గ్రహంపై నీటి కోసం వెతుకులాట.. గురుత్వాకర్షణ శక్తి వల్లే..!
అంగారక గ్రహంపై నీరు 30 శాతం నుంచి 99 శాతం వరకు అంతర్భాగంలోని ఖనిజాల్లో నిక్షిప్తమై ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాసాకు చెందని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్) సంయుక్తాధ్వర్యంలో పరిశోధన జరిపారు. సుమారు 400 బిలియన్ ఏళ్ల కిందట అంగారక గ్రహంపై 100-1500 మీటర్ల లోతులో సముద్ర రూపం నీరు.. గ్రహాన్ని కప్పివేసిందన్నారు. బిలియన్ సంవత్సరాల తర్వాత.. ప్రస్తుతం మార్క్‌పై శుష్కనేలలతో ఉండే పొడి వాతావరణం ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు. అలాగే, మార్స్‌పై గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ.. దీని కారణంగా గ్రహంపై ఉండే నీరు అంతరిక్షంలోకి వెళ్లి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను మార్స్ రోవర్స్, ఆర్బిటర్స్ సాయంతో డేటాను సంపాదించి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. మార్స్ పొరల్లోని ఖనిజాలలో నీరు ఉండిపోవడం, వాతావరణంలోకి నీరు చేరడం వంటి విధానాలతో మార్స్‌పై నీరు లేకుండా ఉందని తెలిపారు. ఇక్కడి నీరుకి, రాతితో రసాయన చర్య జరిగి మట్టి, ఇతర హైడ్రస్ ఖనిజాలు ఏర్పడి ఉంటాయన్నారు. అందుకే మార్స్ గ్రహంపై నీరు ఖనిజ నిర్మాణంలో భాగమైందన్నారు. ఇలాంటి చర్య భూమిపై కూడా జరగుతుందని స్పష్టం చేశారు.