పసుపు రంగు పుచ్చకాయ.. చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..?

praveen
ప్రస్తుతం వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పండు ఏది అంటే అందరు టక్కున చెప్పే పేరు పుచ్చకాయ అన్న విషయం తెలిసిందే ఇక వేసవిలో భగభగ మండి  పోయే సూర్యుడి తాపం నుంచి రక్షించుకోవడానికి ఎంతోమంది పుచ్చ పండు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. పుచ్చ  పండు తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గించడమె  కాదు ఇంకా ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఇప్పటివరకు పుచ్చ పండు ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే ఠక్కున  ఎరుపు రంగు అని చెబుతారు అన్న విషయం తెలిసిందే.



 ఎందుకంటే ప్రస్తుతం సమ్మర్ లో ఎక్కడ చూసినా పుచ్చకాయలు ఎరుపు గానే ఉంటాయి. కాని ఎరుపు రంగు కాకుండా ఇతర రంగులలో ఉన్న పుచ్చకాయలను ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు కానీ..  ఎరుపు రంగు కాకుండా ఇతర రంగాలలో కూడా పుచ్చకాయలు ఉంటాయి అని చెబితే ఎవరైనా నమ్ముతారా. అసలు సిసలైన ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలు మరో రంగులో ఎందుకు ఉంటాయి అని నవ్వుకుంటారు. కానీ అలా అనుకున్నారు  అంటే మీరు పొరపాటు పడ్డట్టే ఎందుకంటే పుచ్చకాయలు కేవలం ఎరుపు రంగులో ఉండడమే కాదు పసుపు రంగులో కూడా ఉంటాయట. ఇటీవలే మార్కెట్లోకి పసుపు రంగు పుచ్చకాయలు కూడా వస్తున్నాయి ఇక వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.



 ఈ పసుపు రంగు పుచ్చకాయలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అక్కడి రైతులు. అయితే ఇటీవలే బెంగుళూరులోని శివారు ప్రాంతాల్లో కూడా ఈ పసుపురంగు పుచ్చకాయలను అత్యధికంగా సాగు చేస్తూ ఉన్నారు.  అయితే ఇక ప్రస్తుతం ఈ పసుపు రంగు పుచ్చకాయలు అన్ని మార్కెట్లలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పసుపురంగు పుచ్చ కాయలలో  గింజలు తక్కువగా ఉండటం.. గుజ్జు ఎక్కువగా ఉంటుందట. పుచ్చకాయ జ్యూస్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయట. అయితే వీటి ధర  ప్రస్తుతం కిలో 20 రూపాయల వరకు మార్కెట్లో పలుకుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: