బాబు దెబ్బతో కమ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !
ఇక, ఇప్పుడు అమరావతి భూములకు సంబంధించి ఏకంగా చంద్రబాబును విచారించేందుకు ఏపీ సీఐడీ అధికారులు ఆయన నివాసాని వెళ్లి మరీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ కాపీని ఆయనకు అందించారు. అదేసమయంలో మాజీ మంత్రి, ఏపీసీఆర్ డీఏ మాజీ ఉపాధ్యక్షుడు పొంగూరు నారాయణకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో ఈ భూములకు సంబంధించిన విచారణ మరింత తీవ్రంగా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ భూములతో సంబంధం ఉన్నవారికి మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబుకు తన వర్గమే దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకునేందుకు ఆయన సామాజిక వర్గం బాగానే కృషి చేసింది. వీరందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా.. కూడా అమరావతితో లింకులు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు టార్గెట్ అయితే..వారంతా కూడా ఆర్థికంగా నష్టపోవడం ఖాయం.
ఈ ఎఫెక్ట్ వచ్చే 2024 ఎన్నికల్లో చంద్రబాబుపై కనిపిస్తుందనేది విశ్లేషకుల అంచనా.. జగన్‌కు కూడా కావాల్సింది అదే. చంద్రబాబును ప్రజల్లో డమ్మీ చేయడంతోపాటు.. ఆర్థిక మూలాలను కూడా దెబ్బకొట్టడం ద్వారా వచ్చే 30 ఏళ్లపాటు అధికారాన్ని చెక్కు చెదరకుండా చేసుకోవడంలో భాగంగానే ఇకపై ఎత్తులు ఉంటాయని అంటున్నారు. మరి ఏం జరుగతుందో చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.