అమరావతిని త్రిశంకు నరకంలా చేసిన చంద్రబాబు...?

VAMSI
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న అమరావతికి మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుతం ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే బలము మరియు బలహీనత. ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వస్తోందంటే అమరావతికి చుట్టూ గుంటూరు మరియు వియాయవాడ లాంటి నగరాలు ఉన్నప్పటికీ వాటి చుట్టూ తగినంత భూమి ఉండగా, పైగా ఈ రెండు మహా నగరాల మధ్యలో బోలెడంత ఖాళీ స్థలముండగా, ఇవి అన్నీ చాలవన్నట్టు ఏపీలో మూడవ మహానగరాన్ని సృష్టించడానికి సిద్దమయ్యారు బాబు గారు. ఈ నగరాన్ని సృష్టించాలనుకున్నది ఎక్కడో బీడు భూములు ఉన్న ప్రదేశంలో కాదు. అచ్చమైన అందమైన 29 పల్లెటూళ్ళు వ్యవసాయమే ప్రధానాధారంగా జీవిస్తున్న భూముల మధ్యలో రాజధానిని నిర్మించడానికి కంకణం కట్టుకున్నారు.
కానీ మొదట అందరూ అనుకున్న ప్రకారం విఐవాడ మరియు గుంటూరు నగరాలకు రాజధాని అమరావతిని కలుపుతూ అభివృద్ధి చేస్తారని అటు కృష్ణా జిల్లా వాసులు ఇటు గుంటూరు జిల్లా వాసులు కలలు కన్నారు. చంద్రబాబు మాత్రం ఈ రెండు నగరాలను గాలికొదిలేసి కేవలం ఆ 29 గ్రామాల మధ్యనే కొత్త మహానగరాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. దాని తరువాత సీఆర్డీఏ ని ప్రకటించినప్పుడు కూడా అదే స్థాయిలో ఆనంద పడ్డారు. ఈ రెండు నగరాల;అను మాత్రమే కాకుండా వీటికి చుట్టుపక్కల ఉన్న పట్టణాలను కూడా కలుపుకుంటూ ఊహించుకున్నారు. అటు వైపు తెనాలి మరియు జగ్గయ్యపేట పామర్రు దాకా వెళుతుందని అనుకున్నారు. హైదరాబాద్ లాగా అభివృద్ధి అవుతుందని అనుకున్నారు.
ఈ సీఆర్డీఏ పట్టణాల పరిధి వరకు వచ్చే మొత్తం జనాభా చూస్తే దాదాపు 50 లక్షల వరకు వచ్చింది. దీనితో పెద్ద నగరమే ఏర్పడుతుందని అందరూ భ్రమలో ఉండిపోయారు.  ఇది కలగా ఉండగానే 29 గ్రామాల పరిధిలో ఉన్న 55 వేల ఎకరాలతో మాత్రమే రాజధానిని ప్రకటించేశారు. అంతే కాకుండా అటు గుంటూరు నుండి కానీ ఇటు విజయవాడ నుండి కానీ చూస్తే 28 కిలోమీటర్ల లోపలకు తీసుకెళ్లారు. దీని నిర్మాణానికి ఒకానొక సమయంలో 45 వేల కోట్ల నుండి 4 లక్షల కోట్ల వరకు అవుతుందన్నారు. నగరాన్ని సృష్టించడం మీకిష్టం లేదా అన్న వ్యాఖ్యలు కూడా చంద్రబాబు చేశారు. అయితే ఇక్కడ ఎవ్వరూ కూడా నగరాన్ని సృష్టించాలని అనుకోవడం లేదు, ఒక నగరాన్ని సృష్టించాలంటే దశాబ్దాలు పడుతుంది.
ఎప్పుడూ కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు హైదరాబాద్ ను చూసి వచ్చాయి. అనంతపురాన్నో లేదా ఆదిలాబాద్ నో చూసి రాలేదు. దానికి కొన్ని భౌగోళిక పరిస్థితులు అనుకూలిస్తేనే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. ఇన్నర్ మరియు ఔటర్ రింగ్ రోడ్ కట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ అడిగితే, అది ఇవ్వకుండా మేమే నిర్మించుకుంటామని డబ్బులు అడిగారు. ఒకవేళ ఇది కనుక వారికిష్ట ప్రకారం వదిలి ఉంటే, కనీసం రింగ్ రోడ్లు వచ్చి ఉండేటివి. మనల్ని నమ్మి భూములిచ్చిన రైతులకి డెవలప్ చేసిన ప్లాట్ లను కూడా ఇవ్వలేకపోయారు. ఇలా అన్ని రకాలుగా అమరావతిని భ్రమరావతిని చేసి ఆడుకున్నారు. దీనితో అమరావతిలో ఎటువంటి ఎదుగూ లేదు బొదుగూ లేదు. మిగతా రైతులు భూములు ఇవ్వలా వద్దా అని ప్రశ్నార్థకం చేశారు.  ప్రస్తుతం అమరావతి ప్రజలకు త్రిశంకు నరకం చూపిస్తున్నారు. అయినా మళ్ళీ మనమే రైతులను సంకటితం చేసి ఉద్యమాన్ని సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: