"కేశవరెడ్డి"పై ఏపీ మంత్రి కుట్ర పన్నారా..!?

Chakravarthi Kalyan
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించారన్న నేరంతో కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టయ్యారు. తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లుగా స్వీకరించిన సొమ్ము దాదాపు 575 కోట్లుగా ఉందని తేలింది. అయితే తనకున్న అప్పుల కంటే ఆస్తులే ఎక్కువని.. ప్రస్తుతం వాటిని అమ్మే పరిస్థితి లేనందువల్ల తనకు ఓ ఏడాది గడువు ఇవ్వాలని కేశవరెడ్డి అంటున్నారు. 

ఐనా.. నిబంధనలకు విరుద్దంగా డబ్బు స్వీకరించడంతో వ్యవహారం సీరియస్ అయ్యింది. ఆయన ఊచల వెనక్కి వెళ్లాడు.. మరి ఇప్పుడు ఆ స్కూళ్ల పరిస్థితి ఏంటి. విద్యార్థుల భవితవ్యం ఏంటి.. ఇవీ అంతుచిక్కని ప్రశ్నలు... అయితే ఇదంతా ఓ పథకం ప్రకారమే జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ కేబినెట్లో ఉన్న ఓ మంత్రి కేశవరెడ్డి స్కూళ్లపై కన్నేసి ఓ పథకం ప్రకారమే ఇదంతా చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు ప్రతిరూపంగా మారిన ఆయన... తమ సంస్థలకు పోటీగా ఎదుగుతున్న కేశవరెడ్డిపై కొంతకాలంగా కన్నేశాడని టాక్. అందుకే అసలు కేశవరెడ్డి వ్యవహారం ఏంటి.. అతని ఎక్కడ దెబ్బ కొట్టవచ్చు.. అన్న విషయంపై పూర్తిస్థాయిలో పరిశోధన చేసి.. డిపాజిట్ల వ్యవహారాన్ని కనిపెట్టారని టాక్. 

మరింకేం చేతికి ఆయుధం చిక్కింది.. అధికారం ఎలాగూ చేతిలోనే ఉంది. ఈ రెండింటి సాయంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు జనమే ఆ స్కూళ్లను సదరు మంత్రిగారి సంస్థకు అప్పగించమని వేడుకునే స్థాయికి సీన్ తీసుకొచ్చేశారు. మరి ఇప్పుడు ఏంజరుగుతుంది.. కేశవరెడ్డి స్కూల్స్.. సదరు మంత్రిగారి గ్రూపులో చేరిపోతాయా.. లేక వేరే ప్రత్యామ్నాయమార్గం ఆలోచిస్తారా.. అన్నది తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: