జగన్ పవర్లోకి వస్తే.. చెడుగుడే..!?

Chakravarthi Kalyan
ప్రతిపక్షనేత జగన్ కు అధికారమంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఒకసారి దెబ్బతిన్నా.. అప్పుడే అధికారం గురించి కలలు కనడం మాత్రం మానలేదేమో. మొన్నటికి మొన్న తాను త్వరలో అధికారపీఠం ఎక్కబోతున్నానని ఎవరో జ్యోతిష్యుడు చెప్పినట్టు కథనాలు వచ్చాయి. ఆయన ఒక్కడే కాదు.. ఆయన పార్టీ వాళ్లలో చాలామంది ఆయనలాగానే మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముంటుంది.

యథారాజా తథా ప్రజా అన్నారు.. కదా..  ఆయన ప్రధాన అనుచరుల్లో ఒకరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేశారు. ఊరికే మాటలు చెబితే ఏం బావుంటుందనుకున్నారో ఏమో.. ఏకంగా అధికారయంత్రాంగానికి వార్నింగ్ ఇచ్చేశారు. సహజంగా అధికార యంత్రాగం అధికారపార్టీకి అనుకూలంగా ఉండటం మామూలే.  అయితే అలా ఉండటం మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏమాత్రం నచ్చలేదు. 

గతంలో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు తన మాటే చెల్లుబాటైన రోజులను ఆయన అప్పుడే మరచిపోయినట్టున్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తడం ఆయన సహించలేకపోతున్నారు. అందుకే అధికా పార్టీ అండతో న్యాయంగా పనిచేయకుండా ఉండేవారిపై తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని అప్పుడే వార్నింగ్ ఇచ్చేశారు. అలాంటి అధికారులపై పగబట్టి మరీ కక్ష సాధిస్తారట. 

అధికారులు ఇప్పుడు జాగ్ర్తత్త పడకపోతే.. ముందు ముందు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోందని చెవిరెడ్డి వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పటికే ఒకసారి అధికారం చేతికి అందకపోయినా.. అప్పుడే ఇలాంటి ఘాటు కామెంట్లు చేస్తే జనంలోకి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్లే అవకాశం పుష్కలంగా ఉంది. జగన్ ఇలాంటి నాయకులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది లేకపోతే.. జనంలో ఉన్న సానుభూతి కూడా ఆవిరయ్యే ప్రమాదం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: