అబ్బర పులి అంటే తోక బారెడు

Kuthuru Raji Reddy
ముఖ్యమంత్రితోపాటు పిసిసి చీఫ్ పై కేంద్రమంత్రి కిశోర్ అధిష్టానానికి లేఖరాశారని మీడియా అదేపనిగా పనిగట్టుకొని ప్రకటిస్తుండగా తాను లేఖనే రాయలేదని మంత్రి కిశోర్ పేర్కొనడంతో మీడియా ఎందుకు ఇలా వివాదస్పందంగా వ్యవహరించిందనేది చర్చనీయాంశమైంది. అబ్బర పులి అంటే తోక బారెడు అన్న చందంగా ఎవరు ఏదో కథనం రాశారని మీడియా అంతా అదేపనిగా రాష్ట్రంలో ముఖ్యనేతలైనటువంటి ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలపై మంత్రి కిశోర్ అనరాని మాటలన్నట్లు ప్రసారంచేయడం, ప్రచురించడంతో మనస్సున్నటువంటి ఎవరికైనా బాధను కలిగిస్తాయి. అంతేకాదు 11పేజీల లేఖను రాశారని జాతీయపత్రిక పేర్కొనడంతో నిజమోకావచ్చునని మిగిలినటవంటి మీడియా ప్రచారం చేసింది. దీంతో ఇటువంటి వార్త ప్రచురించినటువంటి ఆంగ్ల దినపత్రికపై పరువునష్టం దావా వేస్తానని పిసిసి చీఫ్ బొత్స తెలిపారు. ఇటువంటి సమయంలో తాను అసలు లేఖనే రాయలేదని కిశోర్ చంద్రదేవ్ అంటుండగా పత్రిక ప్రచురించినట్లుగా అసలు లేఖ ఎక్కడిదనే విషయం చర్చనీయాంశమైంది. సంచలనాల కోసం వివాదస్పద వార్తలు రాయడం వల్ల కొందరి మనస్సులు గాయపడే అవకాశముంది. ఇటువంటి సందర్భంలో మాటలతో గాయపడిన వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తొందరపడినటువంటి మీడియా యాజమాన్యం ఎటువంటి సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: