టీడీపీని నిండా ముంచేసిన జానీ.. మామూలు దెబ్బ కాదుగా..!
అయితే.. ఈ రెండు చోట్లా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సహా.. రాజధాని సానుకూల ఓటు బ్యాంకు తమ కు అనుకూలంగా ఉంటుందని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఇక్కడ టీడీపీకి పడవలసిన ఓటు బ్యాంకును జనసేన చీల్చిందనే విశ్లేషణలు వస్తున్నాయి. వాస్తవానికి విజయవాడను తీసుకుంటే.. టీడీపీ అభ్యర్థులకు భారీ ఓట్లు పడతాయని అంచనా వేసుకున్నారు. కానీ, వీరికి పడవలసిన ఓట్లు జనసేన ఖాతా ల్లో పడ్డాయి. వాస్తవానికి విజయవాడలోకానీ, గుంటూరులో కానీ.. జనసేన నాయకులు భారీ సంఖ్యలో విజయం సాధించలేదు.
అయితే.. జనసేన అభ్యర్థులకు మాత్రం భారీగా ఓట్లు పడ్డాయి. గెలుపునకు అత్యంత సమీపంలోకి వెళ్లి ఆగిపోయిన అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. దీంతో ఇదంతా కూడా టీడీపీ ఓటు బ్యాంకేనని ప్రచారం ఉంది. అంటే.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు.. టీడీపీకి పడకుండా.. జనసేనకు మళ్లిందని అంటున్నారు. ఇక, విశాఖ విషయాన్ని తీసుకుంటే.. ఇక్కడ భిన్నమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ బీజేపీపై వ్యతిరేకతతోపాటు.. బీజేపీతో పొత్తుతో ఉండడంతోపాటు..విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మాట మాత్రం కూడా స్పందించని పవన్‌పై ఇక్కడి ప్రజలు ఒకింత ఆవేదనతో ఉన్నారు.
సో.. ఇక్కడ మాత్రం టీడీపీ పుంజుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయవాడలో 14. గుంటూరులో 9 డివిజన్లను సాధించిన టీడీపీ విశాఖకు వచ్చే సరికి మాత్రం 30 డివిజన్లను కైవసం చేసుకోవడాన్ని బట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును విజయవాడ, గుంటూరులో జనసేన తన ఖాతాలో వేసుకోవడమే రీజన్‌గా పేర్కొంటున్నారు. మొత్తానికి జనసేనతో ఇప్పుడు టీడీపీ లబోదిబోమనే పరిస్థితి రావడం గమనార్హం.