అమరావతి సెంటిమెంటుతో బ్యాంకు భారీ మోసం...?
ఈ బ్యాంకుకు మొత్తం మూడు బ్రాంచులు నూజివీడు, తిరువూరుమరియు విస్సన్నపేటలలో ఉన్నాయి. బ్యాంకు ఏజెంట్ల ద్వారా ఒక మార్కెటింగ్ సంస్థ లాగా ప్రజలనుండి వంద రూపాయల నుండి ఎంఎంతవరకైనా కట్టవచ్చని నమ్మబలికింది. ఎక్కువ వడ్డీలు ఇస్తామని చెప్పి ఆశ చూపించింది. ఎవ్వరికైనా వడ్డీ ఎక్కువస్తుందంటే ఆశ పడతారు కదా. అందుకే మొత్తం 500 మందికి పైగా తమ డబ్బును జమ చేశారు. ఎక్కువగా బాధితులు రోజుకు 500 చొప్పున ఒక సంవత్సరం పాటు చెల్లించడం జరిగింది 8 శాతం వడ్డీ తో కలుపుకుని సంవత్సరం పాటు కడితే సుమారు ఒక లక్షా 92 వేల రూపాయలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు. సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు అసలు కానీ వడ్డీ చెల్లించక పోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు.
దీనితో రంగంలోకి దిగిన పోలీసులు 406 420 ఐపీసీ సెక్షన్ 5 ఏ పి పి డి ఎఫ్ ఇ 1999 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఈ బ్యాంకు మేనేజర్ మరియు ఇతర డైరెక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే డబ్బు ఎంత ఆమొత్తం అనేది ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనా అమరావతి సెంటిమెంటును వాడుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ పేరుతో మోసం చేశారు. బాధితులు తమ డబ్బును తిరిగి ఇప్పించాలని పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. మరి అతి త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.