ఛీ..ఛీ.. ఈ ఆంధ్రా జనానికి అస్సలు సిగ్గు లేదు.. చేవ చచ్చిపోయారా..?

Chakravarthi Kalyan
ఛీ..ఛీ.. ఈ ఆంధ్రా జనానికి అస్సలు సిగ్గు లేదు.. చేవ చచ్చిపోయారు..?.. అయ్యో.. హెడ్డింగ్‌ చూసి ఈ మాటలు నావి అనుకునేరు.. ఈ మాటలు అంటున్నది నేను కాదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రెండు, మూడురోజులుగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇవే అంటున్నారు. జగన్‌ను ఎన్నుకున్నందుకు ప్రజలను తిట్టిపోస్తున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వనందుకు జనాన్ని నేరుగానే బూతులు తిట్టేస్తున్నారు చంద్రబాబు.

ఈ గుంటూరు ప్రజలకు సిగ్గుందా.. అసలు సిగ్గుంటే వైసీపీ జండాలు పట్టుకున్న వాళ్లను తిరగనిస్తారా.. అమరావతి రాజధాని నా కోసం కట్టుకున్నానా.. మీ కోసమే కదా కష్టపడుతున్నాను.. ఇలా సాగిపోతోంది చంద్రబాబు తిట్ల ప్రసంగం.. విశాఖ, విజయవాడ, గుంటూరు.. ఏ ప్రాంతానికి వెళ్లినా ఇలాగే సాగుతోంది. ఎవరైనా అడ్డు చెబితే.. వినవయ్యా.. విను.. ఏం చేశావు నువ్వు.. అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు చంద్రబాబు. ఈ చంద్రబాబు తీరు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు.

ఇక చంద్రబాబు తీరు ఇలా ఉంటే.. ఆయనకు బాకా పత్రికగా పేరున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సైతం ఇదే తరహా రాతలు రాస్తున్నారు. ఈ ప్రజలు వేస్ట్.. అంటూ తన కొత్త పలుకులో రాస్తున్నారు. తాజాగా ఆయన రాసిన కొన్ని వాక్యాలు చదివితే.. చంద్రబాబు, ఆర్కే దొందూ దొందే అని మీకే అనిపిస్తుంది.

“ ప్రజలు కూడా ఇవాళ తమకు ఏమి వస్తున్నదో అని చూసుకుంటున్నారు గానీ రేపటి గురించి ఆలోచించడం లేదు. ప్రజల అమాయకత్వంపై అంతులేని నమ్మకం ఉన్న జగన్‌ అండ్‌ కో తమ అధికారానికి ఢోకా లేదని విర్రవీగుతున్నారు. వ్యవస్థలన్నింటినీ చెరబడుతున్నారు. అయితే, అధికారంలో ఉన్నంత మాత్రాన అందరినీ, అన్ని వ్యవస్థలనూ అదుపు చేయలేరు. అలా అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా? అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో నాయకులతోపాటు ప్రజల్లో కూడా త్యాగనిరతి ఉండేది. ఇప్పటి నాయకులు ప్రజలను కూడా పూర్తిగా చెడగొట్టారు. మనలో స్వార్థం పెరిగి భయం వెంటాడుతున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా భయం నీడన బతుకుతున్నారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించి సంక్షేమ మోడల్‌ను ఎంచుకోవడంలోనే జగన్‌ వ్యూహం దాగి ఉంది. “.. ఇవీ ఆర్కే రాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: