యజమాని మరణం.. తట్టుకోలేకపోయిన కుక్క.. చివరికి ఫోటో చూస్తూ..?

praveen
శునకం విశ్వాసానికి మారుపేరు అని చెబుతూ ఉంటారు అందరు. అయితే ఈ మాట కేవలం మాటల వరకు  మాత్రమే కాదు ఏకంగా కొన్ని సంఘటనల ద్వారా నిరూపితం కూడా అయింది అన్న విషయం తెలిసిందే.  ఏదైనా ఒక శునకం పై  ఒక్కసారి ప్రేమ చూపించారు అంటే ఇక ఆ వ్యక్తి పట్ల ఆ కుక్క చూపించే విశ్వాసం వెలకట్టలేని విధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. శునకం విశ్వాసానికి  సంబంధించిన ఎన్నో కథనాలు తెర మీదకు  కూడా వచ్చాయి. కుక్క యజమాని చనిపోయిన సమయంలో ఏకంగా కుక్కలు కూడా యజమాని సమాధి వద్ద బాధపడుతూ చివరికి ఏమీ తినకుండా అక్కడే సమాధి వద్ద ప్రాణాలు వదిలిన ఘటనలు  ఎంతోమందిని  కంటతడి పెట్టించాయి అన్న విషయం తెలిసిందే.

 అదే సమయంలో ఇక తనను ప్రేమగా చూసుకునే  యజమానికి ప్రాణాపాయం ఎదురైన సమయంలో ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి యజమానుని కాపాడుకున్న ఘటనలు  కూడా ఎన్నో తెర మీదికి వచ్చాయి. శునకం  యొక్క విశ్వాసాన్ని తెలిపేందుకు సోషల్ మీడియాలో ఎన్నోరకాల ఘటనలు వీడియోలు రూపాయలు తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మరోసారి శునకం విశ్వాసం అందరినీ కంటతడి పెట్టించింది. యజమాని చనిపోయాడు అని తెలుసుకుని ఆ కుక్క జీర్ణించుకోలేక పోయింది. మెదక్ జిల్లా రామాయంపేట లో ఈ ఘటన  చోటుచేసుకుంది.

 వెంకట్ గౌడ్ అనే వ్యక్తి ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. వెంకట్ గౌడ్ కి పెంపుడు కుక్కలు అంటే ఎంతో ఇష్టం.  ఎన్నో కుక్కలు పెంచుకుంటున్నాడు . కుక్కలపై  ఎంతో ప్రేమ చూపించే వాడు. అయితే ఇటీవలే వెంకట్ గౌడ్ గుండెపోటుతో మృతి చెందగా వీరు అనే శునకం తీవ్ర మనస్థాపానికి గురైంది.  ఇంట్లో దండ వేసి ఉన్న వెంకట్ గౌడ్ ఫోటో చూస్తూ అరుస్తూ ఏడుస్తూ ఉంది. అంతే కాదు ఏమీ తినడం లేదు.  యజమాని పట్ల కుక్క  చూపిస్తున్న విశ్వాసానికి ఆశ్చర్యపోతున్నారు స్థానికులు. అంతేకాదు శునకం  అల్లాడిపోతున్నతీరు అందరిని కంటతడి పెట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: