ప్రేమలో పడినోళ్లు.. తల్లో పేలు ఉన్నోళ్లు సుఖపడినట్లు చరిత్రలో లేదు.. !

Suma Kallamadi
ఆడవాళ్లకి అందం జుట్టు. నల్లని, పొడవైన, ఒత్తయిన జుట్టు అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి.అయితే ఆ అందమైన జుట్టును ఒక్కోసారి పేలు పట్టి పీడిస్తూ ఉంటాయి.ఎన్ని ప్రయత్నాలు చేసినాగాని పేలు తలని వదిలి వెళ్లవు. అలా జుట్టులో పేలు ఉంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఆడవాళ్లు ఎదో ఒక సమయంలో పేల సమస్యను ఎదుర్కునే ఉంటారు. తలలో పేలు ఉంటే మహా చిరాకుగా అనిపిస్తుంది కదా.అసలు నిద్ర పట్టదు. ఒక్కటే దురద. అలాగే పేలు కుడుతూ ఉంటే వచ్చే దురదను మాటల్లో చెప్పలేము. ఎంతసేపు గోక్కోవాలని అనిపిస్తుంది.అసలు కొందరు అయితే తల్లో ఒక పేను ఉంటేనే చాలు అది ఎప్పుడు పోతుందా అని సతమత మవుతూ ఉంటారు. అలాగే తలలో  ఒకటి, రెండు పేలుంటేనే తట్టుకోవటం చాలా కష్టం. అలాంటిది తలలో  కుప్పలు తెప్పలుగా  పేలు పడితే ఆ బాధని వర్ణించడం చాలా కష్టం అనే చెప్పాలి.ఇలాంటి ఒక చేదు అనుభవాన్ని  ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతికి ఎదురయింది.

వివరాలలోకి వెళితే  ఆస్ట్రేలియాలోని కమిలోకు చెందిన ప్రముఖ హేయిర్‌ లైస్‌ రిమూవలిస్ట్‌ షెర్రీ రిచర్డ్‌సన్‌ '' నిట్‌ పైకర్స్‌ హెడ్‌ లైస్‌ రిమూవల్‌'' పేరిట ఓ సెలూన్‌ నిర్వహిస్తోంది .కొన్ని రోజుల  క్రితం విపరీతంగా పేలతో బాధపడుతున్న ఒక  యువతి ఆమె దగ్గరకు వచ్చింది. ఆ యువతికి పేలను తొలగించే క్రమములో దువ్వెనతో ఆ యువతి తలను దువ్వగా  కుప్పలు కుప్పలుగా దువ్వెనలో పేలు వచ్చాయి.

అన్ని పేలను ఒక్కసారిగా చూడడంతో ఆమె షాక్ అయ్యి  ఆ పేలని  వీడియో తీసి తన టిక్‌టాక్ ఖాతాలో పోస్ట్ చేసింది.. ఇప్పుడు ఆ  వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో తెగ  వైరల్‌గా మారింది. ఏకంగా ఐదు మిలియన్ల మంది ఆ వీడియోను చూసారు. ఆ వీడియో చూసి ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు తమకు తోచినట్లు ఫన్నీగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఏమి పెట్టి ఆ పేలను మేపుతున్నావ్ తల్లి అని ఒకరు అంటే.. ప్రేమలో పడినోళ్లు.. తల్లో పేలు ఉన్నోళ్లు సుఖపడినట్లు చరిత్రలో లేదని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు. అసలు తల్లో అన్ని పేలు పెట్టుకుని ఎలా జీవిస్తున్నావ్ నువ్వు అని మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: