అక్కడ అబ్బాయికి అమ్మాయి తాళి కడుతుందట..! ఇంకా చాలా విచిత్రాలు..?

Chakravarthi Kalyan
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం.. ఒక్కో సామాజిక వర్గంలో ఒక్క ఆచారం.. ఈ ఆచారాలకు చాలా కారణాలు ఉంటాయి. అయితే కొన్ని ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం. ఇక్కడ సుమారు 3,500 కుటుంబాలు ఉంటున్నాయి. వీరంతా కేవిటి సామాజిక తరగతికి చెందినవారు. చేపల వేటే వీరి ప్రధాన వృత్తి. వీరి పూర్వీకులు ఒడిశాలోని సునాపురం ప్రాంతానికి చెందిన వారు. వారి తాతముత్తాతల కాలంలో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. సునాపురం ప్రాంతంలో వారి పూర్వీకులు పాటించిన వివాహ పద్ధతులనే వీరు నేటికీ కొనసాగిస్తున్నారు.

ఇక్కడి ప్రత్యేకత పెళ్లిలో అమ్మాయి కూడా అబ్బాయి మెడలో తాళి కడుతుంది. పెద్దలు నిర్ణయించిన ముహూర్తం మేరకు వరులు అంతా వధువుల మెడలో ఒకే సమయంలో తాళి కడతారు. అదే సమయంలో వధువులు కూడా పసుపు దారంలో గుచ్చిన బంగారంతో చేసిన ధాన్యం గింజను వరుడి మెడలో కట్టడం ఇక్కడి ఆచారం. ఇది వరుడి మెడలో పద్దెమినిది రోజులు ఉంటుంది. అనంతరం దానిని తీసి భద్రపరుస్తారు.

మరో విశేషం ఏంటంటే.. నువ్వులరేవు గ్రామంలో ప్రతి రెండు, మూడేళ్లకోసారి ఒకే ముహూర్తాన పదుల సంఖ్యలో సామూహిక వివాహాలను జరిపిస్తుంటారు. కుటుంబంలోని వారు ఒక పెళ్లి తర్వాత ఆర్థికంగా కుదురుకోవడానికి రెండు, మూడేళ్లు పడుతుందని వారి భావన. సంబంధాలు ముందే కుదిరినా, అందరితోపాటే వివాహాలు జరిపిస్తారు తప్ప, విడివిడిగా పెళ్లిళ్లు చేయరు. గ్రామంలో నిర్వహించే సామూహిక వివాహ వేడుకలకు ఆ గ్రామ కులపెద్దలు కీలకపాత్ర పోషిస్తారు.

మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ మూడు ఇంటి పేర్లు ఉన్నవారు మాత్రమే ఊరంతా ఉంటారు. చిన్న బెహరా, పెద్ద బెహరా, బైనపల్లి ఇంటి పేర్లతో ఉన్నవారే ఉంటారు. ఈ గ్రామంలో అబ్బాయిలు, అమ్మాయిలే పెళ్లి చేసుకుంటారు. బయటి వారికి ఇక్కడి అమ్మాయిలను, అబ్బాయిలను ఇవ్వరు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయిక్కడ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: