వైసీపీలో ఓవర్ యాక్షన్ స్టార్.. పార్టీ తల పట్టుకుంటోందా ?
ఇక గత ఎన్నికల్లో జగన్ టెక్కలి సీటు పేరాడ తిలక్‌కు ఇచ్చి.. దువ్వాడను ఎంపీగా పోటీ చేయించారు. ఇద్దరూ ఓడిపోయారు. అయితే టెక్కలిలో అచ్చెన్ను ఢీ కొట్టాలంటే దువ్వాడ కరెక్ట్ అని భావించిన జగన్ దువ్వాడకు టెక్కలి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇక ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడును టార్గెట్ చేసే క్రమంలో దువ్వాడ దూకుడుతో రెచ్చిపోతున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల నిమ్మాడలో అయితే ఆయన చేసిన హల్ చల్‌తో నియోజకవర్గంలో ఆయన అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఇటీవల స్థానిక ఎన్నికల వేళ ఎంపీ విజయసాయిని నిమ్మాడలో పర్యటించాలని దువ్వాడ శ్రీనివాస్ ఆహ్వానించగా.. దానికి జిల్లా నేతలే అడ్డుపుల్ల వేశారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. జిల్లాలో ధర్మాన సోదరులతో పాటు స్పీకర్ తమ్మినేని, కృపారాణి వంటి సీనియర్లతో పాటు మంత్రి సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్ లాంటి వాళ్లు ఎంతో మంది దువ్వాడ దూకుడు ఎఫెక్ట్ జిల్లా అంతా పడేలా ఉందని ఆవేదన చెందుతోన్న పరిస్థితి.
అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే తనకు జగన్ సపోర్ట్ ఉందని.. తనను ఎవ్వరూ ఏం చేయలేరని ఆయన విర్ర వీగుతోన్న పరిస్థితి ఉందట. ఏదేమైనా ఈ ఓవర్ యాక్షన్ స్టార్ దూకుడుకు బ్రేకులు వేయకపోతే పార్టీ నష్టపోవడం ఖాయమని సొంత పార్టీ నేతల టాక్ ?