రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేలు.. కేంద్రం కీలక నిర్ణయం..?
అయితే పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఈ డబ్బులు మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఇప్పటికే ఏడు విడుతల డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఎనిమిదో విడత డబ్బులు కూడా త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ ఒక్క రాష్ట్రంలో మాత్రం రైతుల ఖాతాల్లో రెండు వేల కాదు ఏకంగా 18000 జమ చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీఎం కిసాన్ స్కీమ్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొన్నటి వరకు అమలులో లేదు అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ లోని రైతులందరూ పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందలేకపోయారు. కానీ ఇటీవలే పీఎం కిసాన్ యోజన పథకాన్ని అటు పశ్చిమ బెంగాల్లో కూడా అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఒకవేళ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేస్తాము అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండేళ్లకు సంబంధించిన 12000 ఇక ఈ ఏడాది సంబంధించిన ఆరువేల రూపాయలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఒకవేళ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రైతుల ఖాతాల్లోకి 18000 వచ్చి చేరుతాయి.