ఫోన్ నీటిలో పడిందా.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బాగా చేసుకోండి ఇలా..?

praveen
ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఇక గంటల తరబడి అందులోనే కాలం గడుపుతున్నారు. అయితే  స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు ఆ ఫోన్ ని ఎంతో బాగా చూసుకుంటారు.  అయితే కొన్ని కొన్ని సార్లు ఫోన్ వాడటం విషయంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ పొరపాటున మొబైల్ ఫోన్ నీళ్లల్లో పడిపోవటం  లాంటివి జరుగుతుంటాయి. ఒకవేళ మొబైల్ ఇలా వాటర్ లో పడిపోయిన సమయంలో గుండె బద్దలయినంత పని అవుతుంది.

 ఇక ఎన్నో  వేలు ఖర్చు చేసి కొన్న మొబైల్ ఒకవేళ పగిలిపోయి నీళ్లల్లో పడిన కూడా అదే విధంగా ఉంటుంది పరిస్థితి. ఇలా జరిగితే ఎంతోమంది తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అయితే ఇక ఇలా నీళ్లల్లో పడిన ఫోన్ ని బాగు చేసుకునేందుకు వెంటనే సర్వీస్ సెంటర్ కు పరుగులు పెడతారూ అందరూ. అయితే నీళ్లల్లో పడిన ఫోన్ ను మళ్ళీ తిరిగి పనిచేసేలా ఒక టెక్నిక్ అందరికీ అందుబాటులో ఉంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసుకోకుండా మళ్ళీ మామూలుగా పనిచేసేలా మార్చవచ్చు.

 ఇందుకోసం కొంతమంది టెక్నీషియన్స్ విడుదల చేసిన వీడియో కాస్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సెల్ఫోన్ నీటి లో పడగానే ముందుగా ఫోన్ నీటి  నుంచి తీసి ఫోన్ ఆన్  చేయకుండా దాన్ని భాగాలన్నింటిని కూడా గాలిలో ఆరబెట్టి ఆ తర్వాత ఫోన్ భాగాలను  అతికించి సంచిలో ఉడికించిన అన్నంలో ఫోన్ పెట్టి గాలి చొరబడకుండా కట్టేయాలి.  ఇక ఆ ప్యాకెట్ మూడు రోజుల తర్వాత ఓపెన్ చేయాలి. మూడు  రోజుల తర్వాత ఫోన్ ఆన్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే అది అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు అని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో  రకాలు వీడియోలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: