శ్రావణికి జగన్‌తోనే ఇబ్బందా?

M N Amaleswara rao
ఏపీలో యువ నేతల మధ్య పోరు గట్టిగానే నడుస్తోంది. పాత తరం నాయకులు సైడ్ అవుతుంటే, కొత్త తరం నేతలు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలని యువ నేతలే నడిపిస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల యువ నాయకులు ప్రత్యర్ధులుగా ఢీ అంటే ఢీ అంటున్నారు. అలా గట్టిగా తలపడుతున్న నేతల్లో శింగనమల నియోజకవర్గానికి చెందిన యువ నేతలు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, టీడీపీ నాయకురాలు బండారు శ్రావణిలు ఉన్నారు. 2019 ఎన్నికల్లో శ్రావణిపై పద్మావతి భారీ మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో దూకుడుగానే పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ఈ 20 నెలల కాలంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పద్మావతికి బాగా ప్లస్ అవుతున్నాయి.

అయితే సంక్షేమం బాగున్నా సరే అభివృద్ధి బాగోలేదు. టీడీపీ హయాంలో ఇక్కడ మంచి అభివృద్ధి జరిగింది. కానీ అది ఇప్పుడు లేదు. ఇదే ఎమ్మెల్యేకు మైనస్ అవుతుంది. అటు టీడీపీలో శ్రావణి చాలా యాక్టివ్ గా ఉన్నారు. భారీ మెజారిటీ తేడాతో ఓడిపోయినా సరే, ప్రజల కోసం పోరాడుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలని హైలైట్ చేస్తున్నారు. కార్యకర్తలకు కలుపుకునిపోతూ, పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు. నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం కంటే ఇప్పుడు శ్రావణి బాగా పుంజుకున్నారు. పద్మావతికి గట్టి పోటీ ఇచ్చేలా తయారయ్యారు.

అయితే నియోజకవర్గంలో చాలామందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇక్కడ పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. ఇక జగన్ వీరిని టార్గెట్ చేసుకునే పథకాలు అందిస్తున్నారు. ఇక పథకాలు అందినవారు, జగన్‌ని చూసే పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసేలా కనిపిస్తున్నారు. దీని బట్టి చూస్తే శ్రావణికి జగన్‌తోనే ఇబ్బంది ఉన్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి శింగనమలలో ఎలాంటి ఫలితాలు వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: