గుడిని ధ్వంసం చేయడానికి వెళ్లిన టిప్పు సుల్తాన్..‌ ఎందుకు మనసు మార్చుకున్నారు..!?

N.ANJI
పూర్వ కాలంలో కొంత మంది హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ ఉంటారు. ఇక టిప్పు సుల్తాన్ అలాగే ఓ దేవాలయాన్ని ద్వంసం చేయడానికి బయలుదేరాడు. అయితే కేరళలోని మధూరులో పరమేశ్వరుడి ఆలయం ఉంది. మధురవాహినీ నదీ తీరంలో ఇది కొలువైంది. ఈ గుళ్లో నీలకంఠుడు… మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో ప్రధాన దైవం ఈశ్వరుడే అయినా.. ఎక్కువమంది ఇక్కడ విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడానికి వస్తారు. కారణం.. లంబోదరుడి విగ్రహం సైజు ఇక్కడ రోజూ పెరుగుతూ ఉండడమే.

ఇక మధుర మహాగణపతి ఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో పరమశివుడు మదరనాథేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక పూర్వం రాజుల కాలంలో ఈ ఆలయం తుళునాడు రాజ్యంలో ఉండేది. స్వయంభువుగా వెలసిన శివలింగానికి తుళురాజులు ఆలయం నిర్మించారు. మదరు అనే వృద్ధురాలు ఈ శివలింగాన్ని కనుగొనడంతో ఆమె పేరిట ఇక్కడి శివుడు మదరనాథేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి.

ఈ ఆలయం నిర్మాణం కూడా ఏనుగు ఆకారంలో ఉంటుంది. మూడంతస్తులతో నిర్మించిన ఈ ఆలయ వాస్తు, శిల్పకళా కౌశలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఏనుగు వీపు ఆకారంలో కనిపిస్తుంది. ఆలయం లోపలి భాగంలో కలపపై చెక్కిన రామాయణ దృశ్యాలు కనువిందు చేస్తాయి. మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాను చాలా హిందూ ఆలయాలపై దాడులు చేసినట్లుగానే ఈ ఆలయంపైనా దాడి చేసి ధ్వసం చేయడానికి వచ్చాడట.

ఇక దాహం వేసిన టిప్పు సుల్తాన్ అక్కడ బావిలోని నీరు తాగిన తర్వాత మనసు మార్చుకుని ఆలయాన్ని ధ్వంసం చేయకుండానే వెనుదిరిగాడట. తన వెంట ఉన్న సేనలను తృప్తిపరచడానికి ఆలయంపై దాడి చేసినట్లుగా లాంఛనప్రాయంగా బయటి వైపు గోడపై కత్తితో వేటు వేసి, వెనుదిరిగాడట. టిప్పు సుల్తాన్‌ గోడపై వేసిన వేటు గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది.

అయితే మొత్తం మూడు అంతస్తుల్లో ఉన్నమధుర మహాగణపతి కోవెల ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. భక్తులకు ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది. ఈ విగ్రహం పరిమాణం రోజురోజుకూ పెరుగుతుండడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా స్వామివారి లీల అంటూ పూజలు చేస్తున్నారు. ఈ లంబోదరుడిని ఇక్కడ బొడ్డ గణేశా అని పిలుస్తారు.వినాయకచవితికి ఇక్కడ విశేషమైన పూజలుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: