బంపర్ ఆఫర్: మాంసాహార ప్రియులు ఈ త్యాగం చేస్తే.. భారీ బహుమతి..!?

N.ANJI
చికెన్, మటన్ ని ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే మీకో బంపర్ ఆఫర్.. కాకపోతే మీ అలవాట్లను కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే ఇంతకీ ఆ ఆఫర్ ఏంటిది.. ఏం త్యాగం చేయాలి అనుకుంటున్నారా.. ఈ వార్త చదివేయండి. ఇక తాజగా ఓ కంపెనీ పెట్టిన షరతును ఒప్పుకుని మూడు నెలలు మీవి కాదనుకుని నాన్ వెజ్ తినకుండా ఉంటె ఏకంగా భారత్ కరెన్సీలో రూ. 50 లక్షలు గెలుచుకోవచ్చునని సంస్థ యాజమాన్యం వెల్లడించారు.

ఇక పూర్తి వివరాల్లోకి.. బ్రిటన్ లోని వైబ్రెంట్ వీగన్ అనే కంపెనీ.. ‘వీగన్ క్యూరియస్ కోఆర్డినేటర్ గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో ఎంపికైతే మూడు నెలల వరకూ శాఖహార ఉత్పత్తుల్ని మూడు నెలల వరకూ కంపెనీ ఇవ్వడంతో పాటు.. ఓ న్యూట్రిషియన్ ను కూడా పంపించి పర్యవేక్షివేస్తుందని తెలిపారు.

అయితే పూర్తి మాంసాహారులై వారినే ఈ కంపెనీ ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. వారు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యాక మూడు నెలలపాటు మాంసాహారం తినకూడదు. సోషల్ మీడియాలో శాఖాహారం గురించి ప్రచారం చేయాలి. మూడు నెలల తర్వాత కూడా మేము నాన్ వెజ్ తినం అన్నవారికి కోటి రూపాయాల విలువైన శాకాహార ఉత్పత్తులను ఇస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఉద్యోగ ఆఫర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇక ఈ మధ్యకాలంలో చాల మంది మాంసాహారులు శాఖాహారులుగా మారిపోతున్నారు. ఇక శాఖాహారులుగా మారిన వారిలో  మనస్సు స్పష్టంగా శుభ్రంగా మారుతుంది. మీరు ఇంతకు ముందు గమనించని చాలా విషయాలు చూడటం ప్రారంభిస్తారు. మీరు వేర్వేరు పరిస్థితులను భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. మీరు శుభ్రంగా ఉన్నారు. వారు కనీసం అలాంటి మత్తుల నుండి శుభ్రంగా ఉంటారు. శాఖాహారతకు పరివర్తన మానసిక సామర్ధ్యాలను పెంపొందించే దశలలో ఒకటి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: