టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మాతృదేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. అమ్మ నాన్న తరువాత ఒక మనిషి జీవితంలో ముందడుగు వేసేటందుకు సహాయపడే వ్యక్తి ఉపాధ్యాయుడు.ఒక మనిషికి విద్యా బుద్ధులు నేర్పి ఆ మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే వ్యక్తే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు లేకపోతే గొప్ప గొప్పోళ్ళు ఉండరు. సమాజానికి ఒక ఇంజనీర్ కావాలన్న, డాక్టర్ కావాలన్న, పోలీస్ కావాలన్న ఖచ్చితంగా వారి వెనకాల ఉపాధ్యాయుడు వుండాల్సిందే.గుర్తించకపోయినా పర్లేదు కాని వాళ్ళు పడ్డ కష్టానికి ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది నేటి సమాజంలో. ఎంతోమంది చదువుకొని ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు. కాని ఆ చదువు నేర్పిన ఉపాధ్యాయుడు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాడు.

చాలీ చాలని జీతాలతో  ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని గుర్తించకపోయినా  పర్లేదు కాని వారి కష్టాన్ని గుర్తించి వారికి తగిన ప్రతి ఫలం అందేలా ప్రభుత్వం చూడాలి. వారికి జీతాలు పెంచాలి. వారి అక్కర్లు, అవసరాలు తీర్చాలి. అంతెందుకు మనం ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే దాని వెనకాల ఉపాధ్యాయుని హస్తం వుంది.ఎందుకంటే సమాజంలో ఒక మనిషి ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. అలాంటి చదువు మనకు ఉపాధ్యాయుని ద్వారానే లభిస్తుంది. కాని అలాంటి ఉపాధ్యాయులను ఈనాడు ఎవరూ గుర్తించట్లేదు.

ఇక ఒక విషయం గమనించినట్లయితే ప్రైవేట్ స్కూల్స్ లో పని చేసే టీచర్ లకు చాలా మందికి కూడా పదివేలకి మించి జీతం ఉండడు. ఆ చాలీ చాలని జీతంతో వారు కుటుంబాలని ఏ విధంగా పోషిస్తారు. కాబట్టి గవర్నమెంట్ వారికి ప్రభుత్వం తరపున వారి నెలవారి ఖర్చులకి ఎంతో కొంత ఆర్ధిక సహాయం చెయ్యాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు బాగుంటేనే నేటి విద్యార్థులు బాగుపడతారు. రేపటి సమాజం బాగుపడుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: