జగడ్డ : రెండో దశ పంచాయతీ యుద్ధం ప్రారంభం.. ఎక్కడెక్కడో తెలుసా..?
ఈ రెండో విడత ఎన్నికల్లో.. 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు, 175 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3,335 పంచాయతీలు, 33,632 వార్డుల్లో రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఉ. 10.30 గంటల నుంచి రెండోదశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఉంది. ఫిబ్రవరి 5న రెండో దశ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ఉంటుంది.
రెండో విడతలో ఫిబ్రవరి 7న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలపై తుది నిర్ణయం ఉంటుంది. ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.. ఫిబ్రవరి 13న రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13 ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు సాగనున్న పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13న సా. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. ఫలితాల వెల్లడి అనంతరం.. అదే రోజున ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది.
రెండో దశలో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లు, విజయనగరం జిల్లాలో పార్వతీపురం రెవెన్యూ డివిజన్, విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో రెండో దఫాపంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. తూ.గో జిల్లాలో రాజమహేంద్రవరం,రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ లో.. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు,జంగారెడ్డి గూడెం రెవెన్యూ డివిజన్లలోకృష్ణా జిల్లాలో గుడివాడ రెవెన్యూ డివిజన్ లో.. గుంటూరు జిల్లా లో నరసారావు పేట రెవెన్యూ డివిజన్ లో.. ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఒంగోలు, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో.. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో.. కర్నూలు జిల్లా లోని నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో.. అనంతపురం జిల్లాలో ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లలో.. కడప జిల్లాలో కడప రెవెన్యూ డివిజన్ లో చిత్తూరు జిల్లాలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ రెండో విడతలో ఎన్నికలు ఉన్నాయి.