నేడే బడ్జెట్‌.. బడ్జెట్‌ కంటే ముందుగానే అదిరిపోయే శుభవార్త ?

Chakravarthi Kalyan
కరోనా నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంటోంది. వ్యాక్సీన్ ఇచ్చిన బలంతో మరింతగా దూసుకుపోతోంది. తాజాగా వెల్లడైన జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి. 2021 జనవరి నెల జీఎస్టీ వసూళ్ల గణాంకాలను తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. రికార్డు స్థాయిలో జనవరి నెల జీఎస్టీ వసూళ్లు ఉన్నాయి. అంతే కాదు.. అసలు జిఎస్టీ విధానం అమలు తర్వాత ఇదే అత్యధిక వసూళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది.
తాజా లెక్కల ప్రకారం.. అంటే.. జనవరి 31 సాయంత్రం 6.గం.ల వరకు అందిన లెక్కలను బట్టి చూస్తే జనవరిలో రూ.1,19,847 కోట్లు జిఎస్టీ వ‌సూలైంది. ఇందులో సీజీఎస్టీ రూ. 21,923 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 29,014 కోట్లు, ఐజీఎస్టీ రూ. 60,288 కోట్లు అని లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా సెస్ రూపంలో రూ. 8,622 కోట్లు రూపంలో వసూలయ్యాయి. మొత్తం కలిపి బట్టి చూస్తే జనవరిలో రూ.1,19,847 కోట్లు జిఎస్టీ వ‌సూలైంది.
ఈ కొత్త లెక్కలు దేశంలో ధైర్యం నింపుతున్నాయి. కరోనా కష్టాల నుంచి దేశం త్వరలోనే గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాదు.. కరోనాను అవకాశంగా మలచుకుని ఇండియా సత్తా చాటుతోంది. ఇప్పుడు కరోనా  టీకాల విషయంలో భారత్‌ ఖాతాలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. ఆరు రోజుల్లోనే ఇండియా మిలియన్ టీకాలు పూర్తి చేసింది.  భారత్‌లో మొత్తం టీకాల సంఖ్య ఇప్పటి వరకూ 30 లక్షలు దాటేసింది.
అంతే కాదు.. ఆరు రోజుల్లోనే ఇండియా మిలియన్ టీకాలు పూర్తి  చేసింది. ఆరు రోజుల్లోనే ఇండియా మిలియన్ టీకాలు పూర్తి చేస్తే.. అమెరికా 10 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తి చేసింది. స్పెయిన్‌ 12 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తి చేసింది. ప్రపంచంలో అందరి కంటే వేగాంగా మిలియన్ టీకాలు వేసింది మనమే అన్నమాట. దటీజ్ ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: