కాపు వేద‌న‌: కాపు మంత్రుల్లో ఉండేదెవ‌రు ? ఊడేదెవ‌రు ?

VUYYURU SUBHASH
ఏపీలో కాపులు కొన్ని ద‌శాబ్దాలుగా నే రాజ‌కీయంగా సంక‌ట స్థితి ఎదుర్కొంటున్నారు. 27 శాతం ఓటు బ్యాంకు గా ఉన్న వీరిని ఏ రాజ‌కీయ పార్టీ అయినా ఓటు బ్యాంకుగా చూస్తోందే త‌ప్పా వీరికి రాజ్యాధికారం ఇచ్చే దిశ‌గా ఎవ్వ‌రూ ఆలోచ‌న చేయ‌డం లేదు. కాపుల‌కు కొన్ని కేబినెట్ ప‌ద‌వులు ఇచ్చేసి అన్ని రాజ‌కీయ పార్టీలు చేతులు దులిపేసుకుంటున్నాయి. తెలంగాణ‌లో మున్నూరు కాపులు ఒక మంత్రి ప‌ద‌వికి మించి ఎద‌గ‌డం లేదు. ఇక ఏపీలో కాపులే ఎవ‌రికి అయినా రాజ్యాధికారం నిర్ణ‌యిస్తారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు న‌లుగురు కాపుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. గంటా, పైడికొండ‌ల‌, చిన‌రాజ‌ప్ప‌, నారాయ‌ణ వీరిలో చిన‌రాజ‌ప్ప డిప్యూటీ సీఎం, హోం మంత్రిగా ఉన్నారు.

ఇక ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లోనూ న‌లుగురు కాపు మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్ , కుర‌సాల క‌న్న‌బాబు ఉన్నారు. అయితే వీరు పేరుకు మాత్ర‌మే మంతులా ? అన్న సందేహాలు ఉన్నాయి. ఎంతో స‌బ్జెక్ట్ ఉన్న క‌న్న‌బాబు లాంటి వాళ్లు సైతం స్వేచ్ఛ‌గా నోరు విప్ప‌లేని ప‌రిస్థితి. ఇక అవంతి విశాఖ‌లో న‌లిగి పోతున్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ల‌కు ప‌రిమితం కావ‌డం మిన‌హా చేసేదేం లేదు. ఇక ఆళ్ల నాని త‌న శాఖా ప‌రంగా కూడా పెద్ద ప‌నితీరు చూప‌లేక‌పోతున్నారంటున్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రికి మైన‌స్‌లు ఉన్నా.... ప్ర‌భుత్వం, పార్టీ నుంచి మాత్రం వీరికి ఎలాంటి స్వేచ్ఛా లేద‌నే అంటున్నారు. ఏ ప్ర‌భుత్వంలో అయినా కాపు మంత్రులు ఇదే ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు.

గంటా లాంటి స్ట్రాంగ్ లీడ‌రే గ్రూపు రాజ‌కీయాల‌తో స‌త‌మత‌‌మ‌‌య్యారు. ఇక స్థానిక ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో త్వ‌ర‌లో జ‌రిగే ప్ర‌క్షాళ‌న‌లో ఎంత మంది కాపు మంత్రులు ఉంటారు ?  ఎంత మంది అవుట్ అవుతార‌న్న దానిపై కూడా అప్పుడే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. విశాఖ‌లో అవంతిని త‌ప్పిస్తే గుడివాడ అమ‌ర్నాథ్ పేరు లైన్లో ఉంది. ప‌శ్చిమ‌లో ఆళ్ల నానిని త‌ప్పిస్తే గ్రంధి శ్రీనివాస్‌కు ప‌ద‌వి ఖాయ‌మ‌ట‌. ఇక తూర్పులో క‌న్న‌బాబును త‌ప్పిస్తే తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సీనియ‌ర‌గా లైన్లో ఉన్నారు. పేర్ని నానిని కంటిన్యూ చేస్తే ఓకే లేకపోతే అదే జిల్లాలో మ‌రో సీనియ‌ర్ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. మ‌రి కాపు మంత్రుల్లో ఎవ‌రు ఉంటారో ?  ఎవ‌రు అవుట్ అవుతారో ?  చూడాలి. 

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు  8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను  https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో  https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: