బాలయ్యకు వైసీపీ మంత్రుల ఫుల్ సపోర్ట్..!
ఇక చంద్రబాబును వీలున్నప్పుడల్లా ఓ ఆటాడుకునే మంత్రి కొడాలి నాని ఈ విషయంలో ముందే ఉన్నారు. మధ్యలో బాలయ్య తనపై చేసిన విమర్శలను సైతం నాని పట్టించుకోలేదు. బాలయ్య విమర్శలను లైట్ తీస్కొన్న నాని పార్టీ నందమూరి వాళ్లే దే కాబట్టి వాళ్లే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని చెప్పారు. ఇక మరో మంత్రి పేర్ని నాని సైతం ఇదే తరహాలో మాట్లాడుతూ బాలయ్యకు పరోక్షంగా సపోర్ట్ చేశారు. నందమూరి వాళ్లలో చంద్రబాబుకు ముందుగా ఎదురు తిరిగింది హరికృష్ణ.. ఆయన్ను తొక్కేసి.... ఇటు తోడళ్లుడు దగ్గుబాటిని సైడ్ చేసేసిన బాబు బాలయ్య కుమార్తెను కోడలిగా చేసుకుని బాలయ్యకు హిందూపురం సీటు ఇచ్చి ఆయన నోటికి ప్లాస్టర్ వేసేశారు.
ఇక ఇప్పుడు మునిగే స్థితిలో ఉన్న టీడీపీని ఇప్పుడు బాలయ్య మాత్రమే ఆదుకోవాలని, ఈ విషయంలో బాలయ్యకు తమ మద్దతు ఉంటుందని వైసీపీ వాళ్లు చెపుతున్నారు. ఇక టీడీపీలో నందమూరి వీరాభిమానుల్లోనూ ఈ డిమాండ్ ఉంది. మరి ఈ డిమాండ్ మెల్లగా టీడీపీలో పెరిగిపోతే మాత్రం బాబుకి వరుస షాకులు తప్పవు. అప్పుడు బాబు ఏ అంతర్జాతీయ అధ్యక్షుడిని అని ప్రకటించుకుంటారేమో ?