కేటీఆర్ కేబినెట్ అప్పుడే సెట్ అయ్యిందా.... మంత్రులు వీళ్లే..!

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి మార్పు త‌థ్యంగా క‌నిపిస్తూ ఉంది. కేసీఆర్ రెండోసారి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని త‌న‌యుడు కేటీఆర్ కు ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు ఇచ్చేస్తార‌ని టీఆర్ఎస్ నేత‌లే ఎక్కువ మంది చెపుతున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల‌తో పాటు టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తోన్న పార్టీ నేత‌లు కూడా కేటీఆర్ త్వ‌ర‌లోనే తెలంగాణ సీఎం కాబోతున్నారంటూ బ‌హిరంగ వేదిక‌ల మీదే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం కేటీఆర్ ముందే భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు ప్రారంభిం చేస్తున్నారు.

అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే వ‌చ్చే నెల‌లోనే కేటీఆర్ తెలంగాణ కొత్త సీఎం అవుతార‌ని పార్టీ వాళ్లే చెపుతున్నారు. ఇక కేటీఆర్ ముఖ్య‌మంత్రి అవ్వ‌కుండానే ఆయ‌న కేబినెట్లో ఎవ‌రెవరు ?  ఉంటార‌న్న దానిపై కూడా అప్పుడే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం కేసీఆర్ కేబినెట్లో ఆయ‌న‌కు ఎదురు చెప్పే వాళ్లు ఎవ్వ‌రూ లేరు. అంద‌రూ కూడా ముఖ్య‌మంత్రిపై అతివిన‌యం చూపించే వాళ్లే. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు పైకి చెప్పుకోక పోయినా లోలోన తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.

ఇక రేపు కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయినా పార్టీపై ఎంత అస‌మ్మ‌తి ఉన్నా పైకి భ‌జ‌న చేసే బ్యాచ్‌నే త‌న కేబినెట్లోకి తీసుకుంటార‌ని అంటున్నారు. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది.. కేటీఆర్ త‌న టీం లో కొంద‌రిని మంత్రులుగా చేసు కోవాల‌ని చూస్తున్నా అది సాధ్య‌మ‌య్యేలా లేదు. ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న వారు కేటీఆర్ భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రి అన్న విష‌యం ముందుగానే గ్ర‌హించి కేటీఆర్ భ‌జ‌న ఎప్పుడో స్టార్ట్ చేసేశారు. దీంతో ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారిలో ఒక‌రిద్ద‌రిని మిన‌హా అంద‌రిని ప‌క్క‌న పెట్టే సాహ‌సం కేటీఆర్ కూడా చేయ‌క‌పోవ‌చ్చు.

ఏదేమైనా కేటీఆర్ ఇంకా ముఖ్య‌మంత్రి కాకుండానే.. ఆయ‌న కేబినెట్లో మంత్రులు తామే తామే అంటూ కొంద‌రు యువ ఎమ్మెల్యేలు, కేటీఆర్ స‌న్నిహితులు త‌మ అన‌చ‌రుల‌తో చ‌ర్చించుకుంటోన్న ప‌రిస్థితి తెలంగాణ‌లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: