ఒకరు చేస్తానంటే మరొకరు చేస్తాడంటున్నారు : ఎంత తేడా

రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న ప్రధానఘట్టాలు రెండు. ఒకటి చంద్రబాబు ‘ మీకోసం వస్తున్నా ’ రెండవది షర్మిల చేస్తున్న ‘ మరో ప్రజాప్రస్థానం ’. రెండింటి లక్ష్యం ఒక్కటే ప్రజలమనసు చూరగొనడం, రాష్ట్రంలో అధికారం సంపాదించడం. దీనికోసం వారు చేస్తున్న పనికూడా ఒకటే నడుచుకుంటూ ప్రజలవద్దకు వెల్లడం. మాటలు కూడా అవే ప్రజల బాగు కోసం హామీల వర్శం, ప్రత్యర్థులపై విమర్శల వెల్లువ. కాని ఇద్దరి మద్య ఓ భారీ తేడా ఉంది.  ఒకరు తాను చేస్తానంటూ ముందుకు పోతున్నారు. మరొకరేమే చేస్తాడు అంటున్నారు. చూసారా ఎంతతేడా ఒకరిది డైరెక్ట్ స్పీచ్, మరొకరిది ఇండైరెక్ట్ స్పీచ్. తనను గెలిపించండి కష్టాలన్ని దూరం చేస్తాను అని చంద్రబాబు ప్రజలను వేడుకుంటున్నారు. కాని షర్మిల ఆమాట అనడం లేదు ఏకంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు అని తేల్చిచెబుతోంది. అంతే కాదు సిఎం అవుతాడు, మల్లీ రాజన్నరాజ్యం వస్తుంది, మీఅందరికి అన్ని సమకూరుతాయి అని ధీమా వ్యక్తం చేస్తోంది.  ఆపోజిషన్ లో ఉండి ఏంచేయలేక పోతున్నాను, అధికారం ఇవ్వండి అని బాబు కోరుతున్నారు. మీవల్ల తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్న నేను ఇప్పుడు మీరు కష్టాల్లో ఉంటే వాటిని తీర్చడం కోసం మీవద్దకు రావడం నాభాద్యత కాదా అని అడుగుతున్నారు. వాటిని తీర్చాల్సిన కనీస కర్తవ్యం నాపై లేదా.. అందుకే నన్ను గెలిపిస్తే తాను వారికి చేసే పనుల జాబితాను ఏకరువు పెడుతున్నారు. దానికోసం చేయబోయే తొమ్మిదింటి వివరాలను వారి ముందుంచారు. తొలిసంతకం రుణమాఫి పై, అంటూ గద్వాల్ తాను అధికారంలోకి వస్తే పెట్టబోయే మూడో సంతకం గూర్చి కూడా స్పష్టం చేసారు.  షర్మిల జగనన్నతో కోటి ఎకరాలకు సాగునీరందింప చేస్తానంటున్నారు. జగనన్నతో మీకు తన తండ్రి ఇచ్చిన హామీలను, ఆయన ఆశయాలను అమలు చేయిస్తానంటున్నారు. ఓట్లు వేయమని ఎక్కడా అడగడంలేదు. ఏదయినా జగన్ మాటే. అటుఇటు తిరిగి టిడిపిపై విమర్శల వర్షమే. చూసారుగా ఎంత తేడా...అయినా విచిత్రం ఏమిటంటే హాజరవుతున్న జనంలో తేడా కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: