ఎన్నికల విషయంలో జగనోరు ఎందుకు అంత బాధపడిపోతున్నారు..?

P.Nishanth Kumar
స్థానిక ఎన్నికల నిర్వహణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య నెలకొన్న వివాదం సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీమ్ కోర్టు దాకా చేరుకుంది. స్థానిక ఎన్నికలు త్వరగా పూర్తి చేసి పాలనను నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ రమేష్ త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూడగా బలం తక్కువగా ఉందని వైసీపీ ప్రభుత్వం ఆ ఎన్నికలను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.. అయితే నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే పనికాదని తానే ఎవరికీ చెప్ప కుండా ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశాడు..
అయితే ఇది వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా గుబులు పుట్టించింది.. దాంతో షెడ్యూల్ పై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు స్టే విధించగా సదురు స్టేను సవాల్‌ చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ను ఆశ్రయించారు.. ఇరు వైపు వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ తీర్పును ఈరోజు విడుదల చేసింది  డివిజనల్‌ బెంచ్‌.సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఎత్తివేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీచేసిన వెంటనే నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ విషయంలో మరో ప్రకటన రిలీజ్ చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. త్వరలో సీఎం, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే  ప్రజారోగ్యం దృష్ట్యా మొదటి నుంచి ఎన్నికల నిర్వ హణకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టును ఆశ్రయించబో తోంది. మరి కరోనా విజృంభిస్తుందన్న ప్రభుత్వం మాటలను సుప్రీమ్ కోర్టు  బల పరుస్తుందా లేదా ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వాదనను బలపరుస్తుందా...అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: