షాకింగ్: నిమ్మగడ్డ దగ్గర మేము ఉండలేం అంటున్న ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా ఎన్నికల సంఘం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష సాధింపు వైఖరితో వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయంగా ఆయన తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు అని అందుకే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోరుతున్నారని వైసీపీ నేతలు పదే పదే అంటూ వస్తున్నారు. ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం హైకోర్ట్ లో ఉంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల మధ్యలో ఉద్యోగులు కూడా నలిగిపోయే పరిస్థితి ఉంది. ఉద్యోగులు ఎటు సమాధానం చెప్పాలో అర్ధం కాక నలిగిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం లో పని చేయడానికి ఉద్యోగుల విముఖత  వ్యక్తం చేయడం గమనార్హం. ఉద్యగులను రాష్ట్ర ఎన్నికల సంఘం కు బదిలీ చేయడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎనికల సంఘం అభ్యర్థన మేరకు మూడు ఏఎస్ఓ, ఒక టీసీఏ పోస్టులకు పేర్లు సిఫారసు చేసింది ఏపీ సర్కార్. మొత్తం 9 మంది ఏఎస్ఓ లు, ముగ్గురు టీసీఏ పేర్లను పంపిణీ సాధారణ పరిపాలన శాఖ ఇచ్చింది.
ఈరోజు  రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా తమ ఆమోదం లేకుండా తమ పేర్లు ఎలా సిఫార్సు చేస్తారు అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటేషన్ ఉత్తర్వులు రద్దు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం కోరడం గమనార్హం. మరికాసేపట్లో సిఎస్ ను కలిసి ఉత్తర్వులు రద్దు చేయాలని ఉద్యోగులు కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేర్లు పంపడాన్ని సిఎస్ దృష్టికి ఉద్యోగులు తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: