చైనా - పాక్ అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భారత్.. ఇమ్రాన్ కి ఊహించని షాక్..?

praveen
పాకిస్తాన్ చైనా దేశాలమధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలకు మొత్తం ఈ  రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసు.  కానీ ఈ రెండు దేశాలు మాత్రం తమ మధ్య కేవలం స్నేహపూర్వక సంబంధం మాత్రమే ఉంది అని ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేస్తాయి. కానీ చైనా డైరెక్షన్ లో  పాకిస్తాన్ ఉగ్రవాదుల తో యాక్షన్ చేయిస్తుంది అనే విషయాన్ని మాత్రం ఎక్కడా బయటకి రాకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటాయి ఈ రెండు దేశాలు. అదే సమయంలో ప్రస్తుతం భారత్ సరిహద్దులో అటు పాకిస్థాన్ మరోవైపు చైనా కూడా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.


 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చైనా ఆగడాలను ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఈ మధ్య కాలంలో అయితే అధునాతన టెక్నాలజీతో కూడిన కౌంటర్ ఇంటెలిజెన్స్ భారత్లో అభివృద్ధి కావడంతో శత్రు దేశాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఇక ఇటీవల మరోసారి పాకిస్తాన్ చైనా మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతం చేస్తుంది నిజాలను బయటపెట్టింది భారత  కౌంటర్ ఇంటెలిజెన్స్. దీంతో చైనా పాకిస్థాన్ దేశాలు అవాక్కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ప్రస్తుతం భారత శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. బిజీ కామ్  సెక్టర్  దగ్గర చైనా పాకిస్థాన్ దేశాలు కలిసి మిస్సైల్ ని తరలిస్తున్నట్లు ఇటీవలే మిలిటరీ ఇంటిలిజెన్స్ కనిపెట్టింది.  అంతేకాదు ఓపెన్ గా ఈ విషయాన్ని బయట పెట్టింది. రహస్యంగా మీరు మిస్సైల్ ని తరలిస్తున్నారు అంటూ ఈ సమాచారాన్ని పాకిస్తాన్ చైనా దేశాలకు చూపించి షాక్ ఇచ్చింది భారత్. అంతేకాదు ప్రపంచ దేశాల ముందు చైనా పాకిస్థాన్ దేశాలు కలిసి చేస్తున్న దుశ్చర్యలను కూడా బయటపెట్టింది. ఇలా  భారత్  కాదు.. చైనా పాకిస్థాన్ దేశాలు  ప్రస్తుతం యుద్ధానికి సిద్ధమవుతూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నాయని ప్రపంచ దేశాలకు భారత్ తెలియజేసి వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: