చంద్రబాబు: వైసీపీకి బుద్ధి చెప్పాలంటే ఇదొక్కటే మార్గం...!
ఈ ఉప ఎన్నికలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే మన నేతలు అక్కడ ఆదిపత్యం దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక టిడిపి కి అయితే ఇది ఎంతో అత్యవసరం అని చెప్పాలి... ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకొని తన బలం మళ్లీ పుంజుకుంటుందని వైసీపీకి తెలిసొచ్చేలా చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు చంద్రన్న. అక్కడ తమ పార్టీ నేతలను దింపి రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక ఓట్లు పడేలా ప్రజలను చైతన్య పరచడానికి నానా తంటాలు పడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇస్తున్న స్పీచ్ ల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
తిరుపతి నేతలతో సమీక్ష జరిపిన చంద్రబాబు ఈ ఎన్నిక ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. వైసిపిని ఓడించడం ద్వారా చారిత్రాత్మకమైన తీర్పుకు తిరుపతి వేదిక కావాలంటూ... తిరుపతి ప్రజలు ఒక దిశానిర్దేశం లేని వైసీపీ పరిపాలనకు ముగింపు పలికేందుకు ఈ ఉప ఎన్నికలు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో జనవరి 21నుంచి 10రోజుల పాటు, 700 గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేయాలి. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలి. వైసిపి వచ్చాక పెరిగిన దాడులు, విధ్వంసాలు, పన్నుల భారాలు, చేసిన అప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి టిడిపి చర్చ చేసిన మేలును గుర్తు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.... తిరుపతిని అంతగా అభివృద్ధి చేసేందుకు ఎన్నెన్ని కార్యక్రమాలు జరిపారో... ఏ విధంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించారో... 95 వేల మంది ఉపాధి కల్పనకు ఎలా కారణమయ్యారో ఇలా ఒకటి కాదు ఎన్నో విషయాలను ప్రజలకు మళ్లీ జ్ఞాపకం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా టిడిపి తిరుపతి అభివృద్ధికి దోహదపడే వైసిపి మాత్రం వారి ఫోకస్ ఎక్కడో పెడుతూ తిరుపతిని అసలు పట్టించుకోవడం లేదంటూ ప్రతిఘటించారు చంద్రన్న. టిడిపి కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని నింపి తిరుపతిలో ఉప ఎన్నికల కోసం తన జోరు పెంచింది టిడిపి అధిష్టానం. ఇలా ఉపఎన్నికల్లో ఎలా అయినా గెలుపును దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది టిడిపి.