గర్భిణీలు ఆల్కహాల్ తాగొచ్చా.. అందరూ తప్పక తెలుసుకోండి..!?

praveen
సాధారణంగా ఉన్న మహిళల కంటే గర్భం దాల్చిన మహిళలు అతి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం తెలిసిందే. గర్భిణీ మహిళలు ఏ చిన్న పొరపాటు చేసిన లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పుట్టబోయే బిడ్డపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. అందుకే గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ..  కడుపులో పెరుగుతున్న బిడ్డకీ ఎంతో పౌష్టిక ఆహారం అందే విధంగా చూసుకోవాలి.  కేవలం పౌష్టిక ఆహారం తీసుకోవడమే కాదు గర్భం దాల్చిన సమయంలో చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి అనే విషయం తెలిసిందే. గర్భం దాల్చక ముందు ఎన్ని చెడు అలవాట్లు ఉన్నప్పటికీ గర్భం దాల్చిన తర్వాత మాత్రం వాటి అన్నింటికీ దూరంగా ఉండటం ఎంతో మంచిది.

 ఒకవేళ అలా గర్భం దాల్చిన తర్వాత కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటే.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం ఎంతగానో ఉంటుంది అని అటు వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది మహిళలకు సాధారణ సమయాలలో మద్యం తాగే అలవాటు ఉంటుంది. అయితే మద్యం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది మహిళలు అప్పుడప్పుడు మద్యం తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. సాధారణ సమయాల్లో ఇలా మద్యం తీసుకోవడం ఓకే కానీ గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రం మద్యం తాగడం హానికరం అని అంటున్నారు వైద్యులు.

 ఒకవేళ గర్భం దాల్చిన తర్వాత మహిళలు మద్యం తాగితే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై  చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ మహిళలు ఏది తింటే కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా అదే వెళ్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యం తాగితే ఇక ఆ మద్యం  కడుపులో పెరుగుతున్న బిడ్డ రక్తంలోకి చేరుతుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డకు శారీరక లోపాలు బుద్ధిమాంద్యం లాంటి సమస్యలు కూడా వస్తాయట అంతేకాకుండా..  అబార్షన్ అయ్యే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు. లేదా నెలలు నిండకముందే కాన్పు జరిగే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: