మారిన గంటా వ్యూహం....అప్పటివరకు ఉంటారా ?

VUYYURU SUBHASH
ఏపీ రాజకీయాల్లో పార్టీలు మారినా, నియోజకవర్గాలు మార్చినా ఓడిపోని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, అది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావునే. టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టి 1999లో అనకాపల్లి ఎంపీగా విజయం సాధించిన గంటా, 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నెక్స్ట్ టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కథ ముగియడంతో మళ్ళీ టీడీపీలోకి వచ్చి, 2014 ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో, గంటా పార్టీ మారిపోవడం ఖాయమనుకున్నారు. ఓ సరిలో బీజేపీలోకి వెళ్తారని, లేదు లేదు వైసీపీలోకి వెళ్ళడం ఖాయమైందని టీడీపీ అనుకూల మీడియానే వార్తలు వేసింది.

కానీ గంటా పార్టీ మారలేదు. అలా అని టీడీపీలో యాక్టివ్‌గా లేకుండా సైలెంట్‌గా ఉన్నారు. అయితే గంటా ఈ మధ్య రూట్ మార్చారు. టీడీపీలో మళ్ళీ యాక్టివ్‌గా కనబడుతున్నారు. అలాగే మొన్నటివరకు తన సోషల్ మీడియా ఖాతాలో చంద్రబాబు ఫోటో లేకుండానే పండుగలు శుభాకాంక్షలు చెప్పేవారు. కానీ ఇప్పుడు మళ్ళీ బాబు ఫోటో పెట్టి మరీ విషెస్ చెబుతున్నారు. దీని బట్టి చూస్తే గంట వ్యూహం మారినట్లే కనబడుతోంది. ఆయన టీడీపీలోనే కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

కానీ గంటాని నమ్మడానికి వీల్లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ముందుగానీ, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల ముందు గానీ పరిస్థితిని బట్టి గంటా ప్లేటు తిప్పేస్తారని అంటున్నారు. మ‌రో యేడాది పాటు వెయిట్ చేసి.. ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వ‌ర‌కు ఉండి అప్ప‌ట‌కీ టీడీపీ పుంజుకునే అవ‌కాశాన్ని బ‌ట్టి ఆయ‌న నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో గంటా వ్యూహం ఎలా ఉంటుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: