భార్యను ఇంట్లోనుంచి బయటకి నెడితే భర్త ప్రాణం పోయింది.. ఏం జరిగిందంటే..?
ఇక ఇళ్ళు కూలి పోతూ శిధిలాలు మొత్తం మీద పడిపోతున్న తరుణంలో గర్భిణీ భార్యను కాపాడాలని భావించిన యువకుడు చివరికి గర్భిణీ భార్యను కాపాడినప్పటికి తాను మాత్రం శిథిలాల్లో చిక్కుకుపోయి మృతిచెందిన ఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. హృదయాన్ని కలచి వేసే ఈ విషాదకర ఘటన చెన్నైలోని రామనాథపురం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామనాథపురం ఎంజియర్ నగర్ కు చెందిన షణ్ముఖ రావు.. అతని భార్య సంగీత నివసిస్తున్నారు. అయితే ప్రస్తుతం షణ్ముఖ రావు భార్య సంగీత నాలుగు నెలల గర్భిణీ.
ఇక వీరి జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషంగా సాగి పోతుంది. కానీ వీరి సంతోషాన్ని చూసి విధి ఓర్వలేక పోయింది. దీంతో వర్షం రూపంలో మృత్యువు కబళించింది. రామనాథపురం లో ఇటీవలే తెల్లవారుజామున రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే భారీ వర్షానికి తట్టుకోలేక షణ్ముఖరావు సహ పక్కనే ఉన్న ముగ్గురు పెంకుటిల్లు కూడా హఠాత్తుగా కూలిపోయాయి. ఇక భారీ శబ్దాలు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన షణ్ముఖరావు భార్య సంగీతను ఇంట్లో నుంచి బయటకు నెట్టాడు. అదే సమయంలో తాను బయటకు వచ్చేలోపు ఇల్లు మొత్తం కుప్పకూలిపోయింది . శిథిలాల్లో చిక్కుకుపోయిన షణ్ముఖరావు చివరికి ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.